కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు
గ్రామాల్లో అర్హుల పేర్లు డిస్ ప్లే చేయాలి.. అన్యాయం జరిగితే చర్యలు తప్పవు....
క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్.
భీమదేవరపల్లి మే 08(ప్రజామంటలు)
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ,రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన 58 వ,పుట్టినరోజు సందర్భంగా గురువారం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘనంగా స్వాగతం పలికి అనంతరం మంత్రి వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తకొండ లో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ చేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.2014 నుంచి 2023 డిసెంబర్ వరకు పది సంవత్సరాలలో హుస్నాబాద్ నియెాజకవర్గానికి 1237 డబుల్ బెడ్ రూంలు సెలక్షన్ చేయగా అందులో 443 మాత్రమే ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేశారు.పది ఏళ్లలో నియెాజకవర్గంలోని మండలాల్లో భీమదేవరపల్లి జీరో, సైదాపూర్ జీరో, ఎల్కతుర్తి జీరో,కొహెడ జీరో,అక్కన్న పేట జీరో, అన్నారు. నియెాజకవర్గంలోని 200 ఇండ్లు మాత్రమే
ఒక హుస్నాబాద్ టౌన్ లో 168 ఇండ్లు, ఒక సైదాపూర్ లో 20 ఇండ్లు ప్రోగ్రెస్ లో చూపించారన్నారు. ఎక్కడ ఒక ఇల్లు కట్టలేదు.ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంది. సంబంధించి ఎంపిక ప్రక్రియ గ్రామాలలో వీటిని పేదలల్లో పేదలకు ఇవ్వాలి అన్నారు ఎందుకంటే ఇల్లు కావాలని చాల డిమాండ్ ఉంది.ఆర్హులు కూడా చాలామంది ఉన్నారు దానికి నేను ఒప్పుకుంటా, కానీ అందులో నియెాజకవర్గానికి 3500 పూర్తిగా పంచాలన్నప్పుడు జనాభా ప్రకారం 100 మందికి ఒకటి వస్తుంది. కానీ మళ్లీ రెండు నెలలకు మల్ల 3500 ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి.మల్ల నెక్స్ట్ ఇయర్ కు 3500 ఇందిరమ్మ ఇల్లు అందరికీ వస్తాయి. ఓపిక పట్టండి మేము అందరికీ ఇస్తాం,కానీ గ్రామాల్లో అధికారులు కానీ రాజకీయాలకు అతీతంగా ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హులకు ఎంపిక చేయాలని చెప్తున్నా .గ్రామాల్లో అర్హుల పేర్లు డిస్ ప్లే చేయాలని అన్నారు.ఇళ్ల ఎంపిక వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు ఉపయెాగపడాలి అని సూచించారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో భూ భారతి మెడల్ గా అక్కనపేట మండలం ఎంపిక అయిది.సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది.సిద్దిపేట జిల్లాలో కొత్తగా 46 వేల మందికి రేషన్ ద్వారా సన్న బియ్యం వచ్చాయి. అని తెలిపారు.
ఎవరైనా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల జోక్యంలో అధికారులు కానీ మా కార్యకర్తలైన లీడర్లైన బ్రోకర్లైన ఒక్క రూపాయి తీసుకున్నట్లయితే నేనే దగ్గరుండి క్రిమినల్ కేస్ పెడతానని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని హామీలు అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట్టెంపెల్లి ఐలయ్య, కొత్తకొండ దేవస్థానం చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా,యూత్ మండల అధ్యక్షులు జక్కుల అనిల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ కొలుగూరి రాజు,ఆదరి రవి,బొజ్జపురి అశోక్ ముఖర్జీ, ఊస కోయిల ప్రకాష్,చిదురాల స్వరూప,పిడిచెట్టు కనకయ్య,గజ్జల రమేష్,చిట్కురి అనిల్, నగర బోయిన నాగరాజు, కాంతారావు, గజ్జల సురేష్, మురళి, సుదర్శన్ రెడ్డి, మాడుగుల సంపత్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్
