సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 7 ( ప్రజా మంటలు)
అధిక శబ్దం కలిగించే 130 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి
శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాల పై జిల్లా పోలీసులు కొరడా ఝలిపించారు .
గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ద్విచక వాహనదారులు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్ మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్-పొల్యూషన్ చేస్తూ, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్న 130 వాహనాల సైలెన్సెర్స్ లను జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని,శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకోని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనీఖీలు చేపట్టడం జరిగిందన్నారు.
మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే ఆ వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తాం. డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేయొచ్చు. ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్స్‌ను కొనసాగిస్తూనే ఉంటుంది. ఇలాంటి చర్యలు వలన శబ్ద కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాల ప్రమాదం కూడా తగ్గుతుందని ఎస్పీ తెలిపారు.
జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరారు. ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న వాహనాలను గమనిస్తే సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్ ,టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ ,ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ
