ఉగ్రవాద దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం
గొల్లపల్లి ఎప్రిల్ 25 (ప్రజా మంటలు):
జమ్ము కాశ్మీర్ లోని పహల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని నిరసిస్తూ గొల్లపల్లి మండలం కేంద్రం లో శుక్రవారము రాత్రి బస్టాండ్ నుండి ర్యాలీగా బయలుదేరి, గ్రామపంచాయతీ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ యువకులు కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో సుమారు 26 మంది చనిపోయారని, 20 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారని ఉగ్రవాదులు జరిపిన ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అదేవిధంగా ఈ చర్యకు ప్రతి చర్యగా దేశం మొత్తం ఐక్యంగా వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అలాగే మన దేశంలో ఉంటూ మన ఉప్పు తింటూ పరాయి దేశానికి వంతపాడే కొందరు నీచులను కేంద్ర ప్రభుత్వం మన దేశం నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేశారు.
మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే ఇలాంటి చర్యల పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ఐకమత్యంతో ఎదుర్కోవాలని అన్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటనలు పునారవృతం కాకుండా మన దేశ శక్తిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని అన్నారు. అనంతరం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు వేముల సంతోష్ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ శాఖ కుంబర్ కార్ అరుణ్, అంకం సతీష్, కోల వెంకటేష్, ఎనగందుల రమేష్, నల్ల సతీష్ రెడ్డి, నిరంజన్ ,యువకులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)