డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
భారత జాతీయ గీతమైన జనగణమన 1911లోరవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన, మొదటిసారి పాడిన గీతాన్ని 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు. జనగణ మన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. భారత జాతీయ గీతం సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. 1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది. 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ముందుగా ఠాగూర్ సృష్టించారు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడ ప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.
భారతదేశ జాతీయగీతం 'జనగణమన' గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాశారు. అదే ఏడాది డిసెంబర్ 27న కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావే శాలలో దానిని ఆలపించారు. ఆ తర్వాత కూడా జాతీయోద్యమం నేపథ్యంలో ఆ గీతాన్ని అనేక సార్లు, అనేక వేదికల మీద ఆలపించారు. అయితే ఇప్పుడు మనం వినే ట్యూన్‌లో కాకుండా, నిర్ధిష్టమైన స్వర కల్పన లేకుండా, ఎవరికి నచ్చిన రాగంలో వాళ్లు పాడుకునే వారు. జనగణ మనకు ఆ స్వరాన్ని కట్టింది ఒక ఐరిష్ జాతీయు రాలైతే... దానికి వేదికైంది చిత్తూరు జిల్లా మదనపల్లె అనే విషయం చాలా మందికి తెలియని తెలియదు. భారత స్వాతంత్రో ద్యమాన్ని బలపరిచిన డాక్టర్ అనీబిసెంట్ మదన పల్లెలో థియోసాఫికల్ కాలేజీని స్థాపిం చారు. ఐరిష్ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ దాని ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. లండన్ మ్యూజిక్ కాలేజిలో చదువుకున్న ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు.
1919లో దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరోజు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నపుడే ఆయనకు మదనపల్లె వాతా వరణం, జేమ్స్ కజిన్స్ కవిత్వం అంటే చాలా ఇష్టమైన ఠాగూర్, కజిన్స్ అక్కడే ఉన్న విషయం తెలుసుకుని, ఆయన విశ్రాంతి కోసం మదనపల్లెలోని థియోసా ఫికల్ కాలేజీ చేరు కున్నారు. ఠాగూర్‌కు ప్రశాంత వాతావరణం కలిగిన థియో సాఫికల్ కాలేజీలో ప్రతి బుధవారం భోజనాల తర్వాత విద్యార్థులంతా కలిసి పాటలు పాడేవాళ్లు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఠాగూర్, ఒక కార్యక్రమంలో పాల్గొని, ఆ సందర్భంగా ఆయన స్వయంగా తన గొంతుకతో జనగణ మన ఆలపించారు. ఠాగూర్ కంఠస్వరం నుంచి వెలువడిన ఆ పాటకు విద్యార్థులంతా గొంతు కలిపారు. మార్గరేట్ కజిన్స్ కూడా ఆ సమయంలో అక్కడే ఉండి, పాటలోని దేశభక్తిని, జాతీయ భావాన్ని గమనించారు. కానీ అప్పటికి జనగణమనను ఎవరికి వారే తోచిన రీతిలో పాడుకునే వారు. ఎవరూ రాగయుక్తంగా పాడ లేదు. కనుక దానిని తానే స్వర బద్ధం చేయాలని నిర్ణయించు కున్నారు. తెల్లవారి ఆమె ఠాగూర్ ను కలిసి జనగణమనను స్వర బద్ధం చేయాలన్న తన కోరికను వెలి బుచ్చారు. దీనికి అంగీక రించిన ఠాగూర్, ఆమెకు ఆ పాట అర్థాన్ని వివరించారు. దానికి స్వరం ఎలా ఉంటే బాగుంటుందో సూచిం చారు. తర్వాత మార్గరేట్ కజిన్స్ తన విద్యార్థినుల సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ దానికి. బాణీ సమకూర్చారు. తర్వాత ఠాగూర్‌కు తాను కట్టిన స్వరాన్ని వినిపించారు. కొన్ని చిన్న చిన్న సంగీత పరికరాలతో విద్యా ర్థులు రాగయుక్తంగా పాడిన జనగణమన గీతాన్ని విన్న ఠాగూర్ ఆమెను ఎంతగానో అభినందిం చారు. బెంగాల్‌లో పుట్టిన జనగణ మన గీతం మదనపల్లెలో స్వరాన్ని సమకూర్చు కున్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలో ఉన్న సమయంలోనే ఒక ఉదయాన థియోసాఫికల్ కాలేజీ ప్రాంగణం లోని చెట్టుకింద కూర్చుని జనగణమనను ఆంగ్లం లోనికి అనువదించారు కూడా.
ఆ తర్వాత దానిని తన అందమైన చేతిరాతతో రాయడమే కాకుండా, కింది భాగంలో దాని పేరు 'మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' అని రాశారు. దాని కింద ఫిబ్రవరి 28, 1919 అని రాసి, సంతకం చేసి, మార్గరేట్ కజిన్స్‌కు బహుమానంగా ఇచ్చారు. మదనపల్లె కాలేజీ వదలివెళ్లే ముందు ఠాగూర్ దానిని 'దక్షిణ భారతదేశపు శాంతినికేతన్' అని కీర్తించారు.
నిజానికి జనగణమన దేశభక్తి గేయం. ‘జన గణ మన’ ఇక నుంచీ మన కొత్త గణతంత్ర రాజ్యానికి జాతీయ గీతమనీ, దీన్ని అంతా గౌరవించి ఆదరించాలనీ 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రకటన చేశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మహో న్నత పాత్ర పోషించిన ‘వందేమా తరం’ గీతాన్ని కూడా జన గణ మనతో సమానంగా గౌరవించి ఆదరించాలి’’ అని ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 51ఏలో ఈ గీతాన్ని గౌరవించా లంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రస్తావన కనిపిస్తుంది. ‘‘ప్రతి పౌరుడూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి రాజ్యాంగ ఆదర్శాలు, లక్ష్యాలు, సంస్థలను గౌరవించాలి’’ అని ఈ చట్టం పేర్కొంటున్నది. ప్రార్థనగా, కృతజ్ఞతగా పఠించే 52 సెకన్ల ఈ చిన్న గీతానికి ఉన్నంత గుర్తింపు , భారత దేశంలో, ప్రపంచంలో కూడా మరే గీతానికీ లేదు. మన జాతీయ గీతం దేశ సమైక్యతకు సరైన ప్రతీకగా నిలిచింది.
జాతీయ గీతం, జాతీయ పతాకం పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు ప్రదర్శించడ మంటే మాతృభూమిని గౌరవించు కోవడమే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపడానికి ఉపకరిస్తుంది.
జనగణమన పాడినప్పుడు దాని అర్ధాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. దాని నేపథ్యాన్ని, అర్థాన్ని, ప్రాధాన్యతను గుర్తించి, తర్వాత తరం వారికి చేర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
ఠాగూర్ వ్రాసిన ఈ గీతం లో అయిదు చరణాలు ఉండగా కొన్ని రాజకీయ కారణాల వలన కేవలం ఒకే చరణాన్ని మాత్రమే జాతీయ గీతం లో చేర్చడం జరిగింది.
పూర్తి గీతం ఇలా ఉంది...
జనగణమన అధినాయక జయ హే! భారత భాగ్య విధాతా
పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా
వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
2వ చరణం... అహరహ తవ ఆహ్‍బాన్ ప్రచారిత, శుని తవ ఉదార వాని(ణి), హిందు, బౌద్ధ్, శిఖ్, జైన్, పారశిక్, ముసల్మాన్, క్రిస్తాని,పూరబ్ పశ్చిమ ఆశే, తవ సింఘాసన పాశే,
ప్రేమ్ హార్ హొయె గాథా
జనగణ ఐక్య విధాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
3వ చరణం... పతన అభ్యుద్దయ్ బన్ధుర్ పంథా, యుగ్ యుగ్ ధావిత యాత్రి, హే చిరొ సారొథి, తవ రథ్ చక్రే, ముఖరిత పథ్ దిన్ రాత్రి
దారుణ విప్లవ మాఝే, తవ శంఖధ్వని బాజే
సంకట దుఃఖ త్రాతా
జనగణ పథ్ పరిచాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
4వ చరణం... ఘోర తిమిర్ ఘన నిబీడ నిశీథే, పీడిత మూర్చిత దేశే
జాగృత ఛిల తవ అవిచల మంగళ, నత నయనే అనిమేషే
దుస్స్వప్నే ఆటంకే, రక్షా కరిలే అంకే, స్నేహమయి తుమి మాథా
జనగణ దుఃఖ త్రయకా జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
జయ హే!
5వచరణం... రాత్రి ప్రభాతిలా ఉదిల రవిఛావి, పూర్వ ఉదయగిరి భాలే, గాహే విహంగమ్ పుణ్య సమిరన్, నవ జీవన రస్ ఢాలే
తవ కరుణారుణ రాగే, నిద్రిత భారత జాగే,
తవ చరణె నత మాథా
జయ జయ జయ హే! జయ రాజెశ్వర్, భారత భాగ్య విధాతా
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!
More News...
<%- node_title %>
<%- node_title %>
బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల డిసెంబర్ 10 (ప్రజా మంటలు,)
బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలని శృంగేరీ శారద పీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్‌లో మహాభారత ప్రవచన మహాయజ్ఞం 5... మొదటి విడత 11వ తేదీన జరిగే 7 మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్
మేడిపల్లి/ కథలాపూర్/ మల్లాపూర్ /ఇబ్రహీంపట్నం డిసెంబర్ 10(ప్రజా మంటలు ) మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్ మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది బాధ్యతల పంపిణీ, లాజిస్టిక్స్ ఎన్నికల మెటీరియల్‌ను జిల్లా కలెక్టర్... కేంద్ర మంత్రులు గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను కలిసిన ఎంపీ అర్వింద్ పలు సమస్యలపై విన్నపాలు సానుకూలంగా స్పందించిన మంత్రులు
ఢిల్లీ డిసెంబర్ 10 (ప్రజా మంటలు)
S. వేణు గోపాల్
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను వేర్వేరుగా కలిశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలు విజ్ఞప్తులను అందజేశారు.
కేంద్ర రైల్వే శాఖ... స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థి మృతి
కామారెడ్డి డిసెంబర్ 10 (ప్రజా మంటలు):
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడడంతో 10వ తరగతి విద్యార్థి ప్రణవ్ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు.
జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామం నుండి ఖండే ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను... నాలుగవ రోజుకు చేరుకున్న మహాభారతం ప్రవచనం
జగిత్యాల డిసెంబర్ 9 ( ప్రజా మంటలు)స్థానిక ధరూర్ శివారు కరీం నగర్ రోడ్డు లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గత 4 రోజులుగా అత్యంత వైభవవో పేతంగా సాగిపోతున్న మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఉర్రూతలూగిస్తూ సాగిపోతుంది.
కళ్యాణమండపం భక్తులతో కిక్కిరిసిపోయి జనసంద్రం లాగ కనిపిస్తుందని సామాజిక కార్యకర్త తవుటు... గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ
గ్రామాల్లో మర్ఫింగ్ వీడియోల కలకలం
* ఏఐ మార్ఫింగ్‌తో ప్రత్యర్థులపై దుష్ప్రచారం
* గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ
* ఏఐ మార్ఫింగ్‌తో ఓటర్లలో అయోమయం
భీమదేవరపల్లి డిసెంబర్ 10 (ప్రజామంటలు) :
మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏఐ సిత్రాలు, మర్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి.... ట్రాఫిక్ నిబంధనల పై యమధర్మరాజు అవగాహన : ట్రాఫిక్ పోలీసులతో కలిసిరోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) : రోడ్డు ప్రమాదాల పై అవగాహన కలిగించేందుకు నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతివేగం, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా యమధర్మ రాజు వేషదారితో ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులకు అవగాహన కలిగిస్తున్నారు.... చలనచిత్ర రంగ అభివృద్ధికి పూర్తి సహకారం — సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వము పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 రెండో... రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
హైదరాబాద్ డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను విర్చువల్‌గా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో... గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఎమర్జెన్సీ వార్డు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అయితే సదరు... పోష్ యాక్ట్–2013పై అవగాహన ర్యాలీ
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) :
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు కఠినంగా అమలు అవుతున్న పోష్ యాక్ట్–2013 గురించి అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా కమిటీ, యాక్షన్ ఎయిడ్, భరోసా సంయుక్తంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించింది. న్యూ బోయిగూడ నుంచి గాంధీ ఆస్పత్రి ఎదురుగా... రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి.
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మోడల్ స్కూల్ నందు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి సందర్శించినారు, మరియు అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్ చెక్ పోస్ట్ ని కూడా 