బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
జిల్లా ప్రధానకార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ
గొల్లపల్లి (జగిత్యాల)
మార్చి 17 (ప్రజా మంటలు)
నర్సింగాపూర్ గ్రామం 437, 251 సర్వే నంబరులో వందల కొద్ది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా ధరణి పట్టాలు సృష్టించుకున్న వాటిని రద్దు చేయాలని బిజెపి నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
నాయకులు మాట్లాడుతూ నర్సింగాపూర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకోవడమే కాకుండా కొందరు అవినీతి రెవెన్యూ ఆఫీసర్ల అండతో ధరణిలో నమోదు చేశారు. అంతేకాకుండా రైతు బంధు లబ్ది పొందుతూ వస్తున్నారు. అయితే ఆ భూముల్లో ఎలాంటి వ్యవసాయం చేయకుండా ప్రభుత్వం సొమ్ము రైతుబంధు ద్వారా వృధా అవుతుంది. ల్యాండ్లో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. మాములుగా పట్టా భూముల్లో ఇటుక బట్టి నిర్వహించాలన్న నాలా కన్వర్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పట్టా భూములంటూ ఆక్రమించి రైతుబంధు పొందుతూ ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోక వడం అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది.
నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారంలో రెవెన్యూ ఆఫీసర్ల హస్తం ఉంది. గతంలో జగిత్యాలలో పని చేసిన ఓ జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఉన్నారు వారి పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి రగిళ్ళ సత్యనారాయన మాజీ కౌన్సిలర్ కాయితి శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కౌడు వెంకటీ , రాపర్తి రాజు, పుప్పాల ప్రభాకర్, రగిళ్ల నారాయణ, ద్యవనపెల్లి జ్ఞానేశ్వర్ , చక్రాల జలపతీ, జక్కుల మహేష్, రగిల్లా ప్రణయ్, రాపర్తి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
