ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి

On
ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి

 *  ప్రైవేట్​ స్కూళ్ళ నిర్వహణ సవాళ్ళతో కూడుకున్నది
    *  కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి

సికింద్రాబాద్​ మార్చి 16 (ప్రజామంటలు) : 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో మాత్రం రాజీ పడవద్దని, ఈ రోజుల్లో చదువుతోనే పిల్లల భవిష్యత్​ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్​రెడ్డి అన్నారు. ముషీరాబాద్​ గాంధీ నగర్​ సురభి బాలవిహార్​ స్కూల్​ దగ్గర ఎస్​ఆర్​కే గ్రూప్​ ఆఫ్​ స్కూల్స్​ ఉదాన్​ ఉత్సవ్​–2025 వార్షికోత్సవ వేడుకలకు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈసందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ...ఈ రోజుల్లో ప్రైవేట్​ పాఠశాలల నిర్వహణ అనేక సవాళ్ళతో కూడుకున్నదన్నారు. ఈ విషయంలో కరస్పాండెంట్లను అభినందిచాలన్నారు. ఓ వైపు తాము ఉపాధి పొందుతూ, నలుగురికి ఉపాధి కల్పిస్తూ , రేపటి భావి భారత పౌరుల తయారీలో ప్రైవేట్​ స్కూల్స్​ నిర్వాహకులది కీలకపాత్ర ఉందన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్​ మాట్లాడుతూ..ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదువుకొని భవిష్యత్​ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. రిటైర్ట్​ ఐఏఎస్​ అధికారి డా.బి.జనార్థన్​ రెడ్డి మాట్లాడుతూ...ప్రస్తుత వ్యవస్థ బాగుపడాలంటే ఎడ్యుకేషన్​ ఎంతో అవసరమని, చదువుకున్న పిల్లలే రేపటి భారత దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలిపేవారని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భారత దేశ రక్షణకై త్రివిధ దళాలగా కాన్సెప్ట్ పైన ప్రీ ప్రైమరీ చిల్డ్రన్స్ మరియు భారతదేశ సంస్కృతి పైన ఒకటి నుండి 5వ తరగతి విద్యార్థులు ఆపై తరగతి వాళ్ళు మాతృ ప్రేమ తండ్రికి గౌరవం ఆడపిల్లల్ని ఏ విధంగా అభిమానించాలని చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి ఇందులో ముఖ్యంగా దశావతారాలు కుంభమేళా నవదుర్గ అవతారాల సాంగ్స్ సాంగ్స్ యొక్క నృత్యాలు తల్లిదండ్రులను అలరించినాయి.  బీజేపీ మహంకాళి జిల్లా అద్యక్షులు గుండగోని భరత్​ గౌడ్​, కార్పొరేటర్​ పావని వినయ్​ కుమార్​, అబ్బాస్​, డాక్టర్​ ఫణి పవన్​, ఎస్​ఆర్​కే గ్రూఫ్​ ఆఫ్​ ఇన్​స్టిట్యూషన్స్​ ప్రిన్సిపాల్​ సుజాత,  గ్రూఫ్​ ఆఫ్​ చైర్మన్​ శివరామకృష్ణ ఆచార్య, విద్యార్థులు, పేరేంట్స్​ పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

#Draft: Add Your Title

#Draft: Add Your Title సికింద్రాబాద్ జూలై 09 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ్ ఆశ్రమ్ లో శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆరవ రోజు బుధవారం శ్రీసాయి బాబా ఆలయంలో శ్రీసాయి నరసింహాస్వామి  సేవ నిర్వహించగా, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈసందర్బంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో...
Read More...
Local News  State News 

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు. సికింద్రాబాద్, జూలై 09 (ప్రజామంటలు) : కల్తీ కల్లు తాగిన ఘటనలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం(47) అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రోజు కల్లు తాగిన సీతారాం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో అదే రోజున అరుంధతి ఆసుపత్రికి వెళ్ళినట్లు అతని భార్య అనిత తెలిపారు. గాంధీ ఆసుపత్రికి...
Read More...
Local News 

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ 📍 భీమదేవరపల్లి మండలం, జూలై 9 (ప్రజామంటలు) 🌿 ఆషాడ మాసం చివరదశలో భక్తి, ఆనంద, స్నేహ బంధాలతో సాగిన ఓ మధుర ఘట్టం… భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో వనభోజనాలను నిర్వహించారు. ప్రకృతి ఒడిలోని హరితవనంలో ఆటపాటలతో, మిఠపలుకులతో, హాస్యాలతో వెలిగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ మరిచిపోలేని అనుభూతిగా...
Read More...
Local News  State News 

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ సికింద్రాబాద్  జూలై 09 (ప్రజా మంటలు): ఆషాడ బోనాల జాతరను ఆయా ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఆయా ఆలయాలకు అందించే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈమేరకు ఇటీవల బన్సీలాల్ పేట డివిజన్ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి బోనాల జాతర చెక్కులు...
Read More...
Local News  State News 

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల, జులై 08 (ప్రజా మంటలు) : కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర...
Read More...
Local News 

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ సికింద్రాబాద్, జూలై 08 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి వ్యాధి నివారణ ఆశ్రమ్ లో జరుగుతున్న శ్రీసాయి సప్తాహం లో భాగంగా మంగళవారం శ్రీసాయి ధన్వంతరీ సేవ ను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సద్గురు శ్రీశ్రీసాయి కుమార్ జీ  సాయిబాబా సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సత్సంగ్ లో...
Read More...
Local News 

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థాన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మే 14 నుంచి జూలై 7 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన మొత్తం కానుకలు రూ 87,24,602 ఆదాయం వచ్చిందని  ఆలయ ఈవో పి.మహేందర్ గౌడ్ తెలిపారు. జనరల్ హుండీల ద్వారా రూ86,18, 047 ఆదాయం...
Read More...
Local News 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం  సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): అమెరికా లో ఆగస్ట్ నెలలో నిర్వహించే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ 25 వసంతాల సెలబ్రేషన్స్ కు రావాలని టీడీఎఫ్ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వాన లేఖ అందజేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్న టీడీఎఫ్ ను మంత్రి...
Read More...
National  Local News  State News 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జూలై 17న నిర్వహించబోయే రైల్ రోకో ట్రైలర్ మాత్రమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయవచ్చు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పి జీవో ఇప్పించాలి -  న్యూ ఢిల్లీ జూలై 08:...
Read More...
Local News 

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ 

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్  .మెట్ పల్లి జులై 7 ( ప్రజా మంటలు) మెట్ పల్లి మండలం పెద్దపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  ఆకస్మిక తనిఖీ చేశారు.. పాఠశాల పరిసరాలు,తరగతి గదులను పరిశీలించారు..   పాఠశాల విద్యార్థులు హాజరు వివరాలు తెలుసుకున్నారు.   విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన సీజనల్...
Read More...
Local News 

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్    మేడిపల్లి/ భీమారం జులై 7 (ప్రజా మంటలు)   పలు అభివృధి నిర్మాణాల సీసీ రోడ్స్ డబుల్ రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , తో కలిసి పాల్గొన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. సోమవారం రోజున జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి భీమారం...
Read More...
Local News 

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం   జగిత్యాల జులై 17 ( ప్రజా మంటలు) ఆషాడ మాసం పురస్కరించుకొని పట్టణంలోని పద్మశాలి కిట్టి పార్టీ సభ్యులు స్థానిక ఉమా శంకర్ గార్డెన్స్ లో మెహందీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో అలరించారు. అనంతరం అల్పాహారంతో కార్యక్రమం ముగిసిందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు.
Read More...