గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్
సమాచారం ఇచ్చిన కాలుని వాసులకు కృతజ్ఞతలు తెలిపిన సి ఐ నిరంజన్ రెడ్డి.
మెట్టుపల్లి మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని కాలనీవాసులు చూసి మధ్యాహ్నం సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ ఐ కిరణ్ సిబ్బందితో శాంతినగర్ లోని ఒక ఇంటిలో నలుగురు బీహార్ రాష్ట్రానికి చెందిన రూపేష్ కుమార్,సునీల్ కుమార్, సంతోష్ కుమార్,చోటు కుమార్ లను పట్టుకొని విచారించమని అన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... గత కొన్ని నెలల క్రితం మెట్ పల్లి పట్టణానికి బీహార్ నుండి నలుగురు వ్యక్తులు వచ్చి హమాలి పని చేసుకుంటూ శాంతినగర్ లో నివాసముంటూ, ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో బీహార్ రాష్ట్రం నుండి గంజాయిని తీసుకొని వచ్చి వాళ్లు సేవించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన మెట్ పల్లి, మల్లాపూర్ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముతున్నారని అన్నారు.
నిందితుల యజమానికి చెందిన అశోక్ లేలాండ్ వాహనంలో తిరుగుతూ, నిందితులు అమ్ముతున్నారని అన్నారు. మధ్యాహ్న సమయంలో కాలనీవాసులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి నిందుతులను పట్టుకొని 450 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, అశోక్ లేలాండ్ వాహనాన్ని సీజ్ చేసి రిమాండ్ కు తరలించామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. సమాచారం ఇచ్చిన కాలనీవాసులకు పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం
