డిటిఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక
మండల అధ్యక్షుడిగా దాసరి రవీందర్, కార్యదర్శిగా మాడుగుల నవీన్ కుమార్
భీమదేవరపల్లి ప్రజామంటలు ఫిబ్రవరి 12
తేది.11.02.2025 మంగళవారం రోజున డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భీమదేవరపల్లి మండల శాఖ సర్వ సభ్య సమావేశం మండల శాఖ అధ్యక్షులు దాసరి రవీందర్ అధ్యక్షతన బాలుర ఉన్నత పాఠశాల మల్కనూరు లో జరిగింది.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బత్తుల అశోక్ కుమార్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులు చర్చించి ఆమోదించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ గత సంవత్సరం విద్యారంగానికి కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించిందని ఈ సంవత్సరం బడ్జెట్లో కనీసం 15% విద్యారంగానికి నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల పిఆర్సి నివేదికను కమిషన్ నుండి వెంటనే తెప్పించుకొని 01.07.2023 నుండి అమలు చేయాలని, పెండింగ్ డి.ఎ లు విడుదల చేయాలని, సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి అర్హులైన ఉపాధ్యాయులకు పర్యవేక్షక పోస్టుల పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిటిఎఫ్ సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటేనే సమాజానికి మేలు జరుగుతుందని,తద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలకు న్యాయం జరుగుతుందని అన్నారు.ఉపాధ్యాయులు కూడా అంకిత భావంతో పనిచేసి పాఠశాలల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. అనంతరం డి టి ఎఫ్ భీమదేవరపల్లి మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. *అధ్యక్షులుగా దాసరి రవీందర్( ముల్కనూర్),* *ప్రధాన కార్యదర్శిగా మాడుగుల నవీన్ కుమార్(గట్ల నర్శింగాపూర్)* ఉపాధ్యక్షులుగా పి .శ్రీకాంత్ (భీమదేవరపల్లి) ,జె.స్వప్న(కొత్తకొండ),కార్యదర్శులుగా బి. ప్రేమ్ కుమార్(ధర్మారం) కె. రాజ్ కుమార్(వంగర) సిహెచ్ కిరణ్(కొత్తకొండ)జిల్లా కౌన్సిలర్లుగా ఏ శ్రీనివాస్ రెడ్డి(గట్ల నరసింగాపుర్ )సునీతాదేవి(రత్నగిరి) డాక్టర్ ఎ .కిషన్(మల్లారం) గొర్రె చిరంజీవి(వంగర) ఆడిట్ కమిటీ కన్వీనర్ బి. అశోక్ కుమార్(గట్ల నరసింగపూర్)సభ్యులుగా జె. ప్రవళిక(గాంధీ నగర్) ఎం. కమలాకర్(మల్లారం) లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా నోముల శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులుగా అటుకుల శ్రీనివాస్ రెడ్డిలు వ్యవహరించడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
