నచ్చిన వారికే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం
– మైనార్టీ గురుకులంలో సీనియర్‌ను పక్కనపెట్టి జూనియర్‌కు ఉద్యోగం కట్టబెట్టిన అధికారులు – నిబంధనలకు విరుద్ధంగా నియమకం
– ఏడాది పాటు న్యాయం కోసం సీనియర్ ఉద్యోగి పోరాటం
– మంత్రి ఆదేశించినా ఉద్యోగం ఇవ్వకుండా అధికారులు కాలయాపన
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 15 (ప్రజా మంటలు)
జిల్లాలోని జగిత్యాల జిల్లా కేంద్రం లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో సీనియర్‌ను పక్కన పెట్టి జూనియర్‌కు ఉద్యోగం ఇవ్వడం పట్ల సీనియర్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి అన్యాయం జరగడంతో ఏడాది కాలంగా బాధితుడు కార్యాలయం చుట్టూ న్యాయ పోరాటం చేస్తున్నాడు. అక్రమంగా ఉద్యోగం సాధించిన వారిపై చర్యలు తీసుకుని అదే ప్లేస్‌లో తనకు ఉద్యోగం ఇప్పించాలని జిల్లా, రాష్ట్రస్థాయి కార్యాలయాల చుట్టూ ఏడాది కాలంగా తిరుగుతున్నాడు.
మంత్రి చెప్పినా పట్టించుకొని అధికారులు
మంత్రికి విన్నవించగా మంత్రి స్పందించి సదరు బాధితునికి న్యాయం చేసి ఉద్యోగం ఇప్పించాలని ఆదేశించినప్పటికీ వారు చేసిన తప్పిదంతో సీనియర్ ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వలేక,భవిష్యత్తులో ఖాళీ ఏర్పడితేనే ఉద్యోగం ఇస్తామని కాలయాపన చేస్తూ బాధితునికి అన్యాయం చేయడంతో విసిగి వేసారిన బాధితుడు విలేకరులతో తన గోడు వెల్లబోసుకున్న వైనం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గొల్లపల్లి మండలం లోని భీంరాజ్‌పల్లికి గ్రామానికి చెందిన తొగిటి గణపతి మెట్‌పల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా మూడు సంవత్సరాల 7 నెలలు విధులు నిర్వహించాడు. ఆ పాఠశాలకు గత సంవత్సరం రెగ్యులర్ ఉపాధ్యాయుడు రావడం వల్ల గణపతిని విధుల నుంచి తొలగించారు. అదే సమయంలో జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల జగిత్యాల బాయ్స్–1లో పీజీటీ తెలుగు ఉపాధ్యాయులు జేఎల్‌గా ప్రమోట్‌అయినందున ఖాళీ ఏర్పడింది.
దానికి హెడ్ ఆఫీస్ రూల్స్ ప్రకారం జిల్లాలో మైనార్టీ పాఠశాలల్లో పనిచేసిన వారిని సీనియార్టి ప్రతిపాదికన భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ అప్పుడు ఆర్‌ఎల్‌సీగా విధులు నిర్వహించిన దాసరి రాజేందర్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి చిత్రు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రెండు సంవత్సరాల సీనియార్టి కలిగిన సుదర్శన శర్మను నియమించుకున్నారని బాధితుడు వాపోయారు. అదే సమయంలో అదే పాఠశాలలో నియమించిన ఆర్ట్ టీచర్ నియమకం కూడా వారికి నచ్చిన వారికే ఇవ్వడం జరిగిందని వాపోయారు.
ఆర్ట్ ఉద్యోగి నియామకం అంతే
ఆర్ట్ ఉద్యోగానికి గతంలో కోరుట్ల మైనార్టీ పాఠశాలలో పనిచేసిన చంద్రశేఖర్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడంతో పై అధికారులు ఎంక్వైరి జరిపి అతన్ని విధుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. కానీ ఆర్‌ఎల్‌సీ దాసరి రాజేందర్ అదే వ్యక్తిని తిరిగి టీచర్‌గా నియమించుకున్నారు. ఈ అక్రమ నియమకాలపై ఆరు నెలల క్రితమే జిల్లా మైనార్టీ సంక్షేమాధికారికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని తెలిపారు. ఆగస్టు నెలలో ఆర్టీఏ కింద దరఖాస్తు చేసుకున్నా జిల్లాస్థాయి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోయారు.
రాష్ట్రస్థాయి అధికారులను కలిసినా ..
రాష్ట్రస్థాయి అధికారులను కలిసి న్యాయం చేయాలని విన్నవించగా జిల్లా మైనార్టీ అధికారికి మౌఖిక ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆలస్యం కావడంతో అప్పటి మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిశానని, వెంటనే స్పందించిన మంత్రి సీనియర్టి ఉన్న గణపతిని ఉద్యోగంలో నియమించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ నెల రోజులు గడిచినా కాలయాపన చేస్తున్నారని వాపోయారు.
మరో ఖాళీ వస్తే తప్ప న్యాయం చేయలేం
ఖాళీ ఏర్పడితే తప్ప ఉద్యోగం ఇవ్వలేమని నిర్లక్ష్యంగా అధికారులు సమాదానం చెబుతున్నారని వాపోయారు. దీనిపై పరిశీలించి తప్పుడు మార్గంలో నియమించబడిన వారిని తొలగించి అట్టి ఉద్యోగాల్లో రెండింటికి అర్హత ఉన్న నాకు ఏదైనా ఒక ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. గత సంవత్సరం కాలంగా ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, అట్టి ఉద్యోగం నాకు ఇవ్వకుండా నన్ను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసిన ఆర్‌ఎల్‌సీ దాసరి రాజేందర్, డీఎండబ్ల్యూవో చిత్రులపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెదక్‌లో వరద బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత
మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు):
మెదక్ జిల్లా ధూప్ సింగ్ తండాలో ఇటీవల చోటుచేసుకున్న భారీ వరదల నేపథ్యంలో బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు పరామర్శించారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ధూప్ సింగ్ తండా పరిసరాల్లో వరద ముంపు కారణంగా దెబ్బతిన్న కల్వర్టును... ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి ::జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 15 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని రాపల్లె, మరియు పెగడపల్లి మండలం లోని కొండయ్య పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రత్యక్షంగా సందర్శించి, కొనుగోలు కేంద్రాల పనితీరును సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వరి ధాన్య... జగిత్యాల రూరల్‌లో బాల్యవివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
జగిత్యాల రూరల్ నవంబర్ 15 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం పరిధిలోని గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలన కోసం మహిళా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత విభాగం, సఖి వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన జిల్లా బాలల పరిరక్షణ... "తెలంగాణ రాష్ట్రం – విద్యా వ్యవస్థ” అంశంపై రేపు రౌండ్ టేబుల్ సమావేశం
ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ నవంబర్ 15 (ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్రంలోని విద్యా రంగ ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించేందుకు తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (టీజేటీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీజేటీఎఫ్ అధ్యక్షుడు మోరం వీరభద్రరావు... బీఆర్ఎస్‌కు సోషల్ మీడియానే తప్ప… క్యాడర్ లేదు: కల్వకుంట్ల కవిత
మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కిన పరిస్థితుల్లో బీఆర్ఎస్‌పై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సూటిగా, కాస్త పదునైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి “సోషల్ మీడియానే తప్ప, నేలమీద క్యాడర్ లేదని” కవిత విమర్శించారు.
ఎన్నికల హైప్ సోషల్ మీడియాలో సృష్టించుకోవడంతో పార్టీ నేతలు గెలుస్తున్నామనుకుని... తెలంగాణలో బీజేపీకి మరో 50 ఏళ్ల దాకా అధికారంలో అవకాశం లేదు: రాజాసింగ్
హైదరాబాద్ నవంబర్ 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారేలా గోషామహల్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ (బీజేపీ) నేత టిని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ వచ్చే 50 ఏళ్లలోనూ అధికారంలోకి రాదని ఆయన ప్రకటించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ…“తెలంగాణలో ప్రజలు బీజేపీకి దూరం అవుతున్నారు. రాష్ట్ర రాజకీయాల దిశ బీజేపీకి... నచ్చిన వారికే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం
– ఏడాది పాటు న్యాయం కోసం సీనియర్ ఉద్యోగి పోరాటం– మంత్రి ఆదేశించినా ఉద్యోగం ఇవ్వకుండా అధికారులు కాలయాపన
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 15 (ప్రజా మంటలు)
జిల్లాలోని జగిత్యాల జిల్లా కేంద్రం లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో సీనియర్‌ను పక్కన పెట్టి జూనియర్‌కు ఉద్యోగం ఇవ్వడం పట్ల సీనియర్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి... కాంగ్రెస్ సీనియర్ నేత గుజ్జర్ కిరణ్ హఠాన్మరణం
వరంగల్,నవంబర్ 15 (ప్రజా మంటలు):
వరంగల్ సిటీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరీమాబాద్ కు చెందిన గుజ్జర్ కిరణ్ (49) శుక్రవారం రాత్రి హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ ఇటీవల ఆసుపత్రిలో కాలుకి సర్జరీ చేయించుకుని ఇంటికి చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
40... ఈషా స్కూల్ ఆఫ్ నాలెడ్జిలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు
జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని ఈశా స్కూల్ ఆఫ్ నాలెడ్జ్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విద్యార్థుల కల్చరల్ కార్యక్రమాలతో స్కూల్ సందడిగా మారింది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలోనే విజేతలకు బహుమతులు... చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించిన విక్రమ్ మెరిట్ ట్యుటోరియల్స్
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజామంటలు):చాచా నెహ్రూ జయంతి సందర్భంగా విక్రమ్ మెరిట్ ట్యుటోరియల్స్‌లో చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు కేవలం చదువుతో పాటు మానసిక ఉల్లాసం కోసం వివిధ రకాల గేమ్స్‌ను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా హాజరై తమ... ఐబొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
హైదరాబాద్ నవంబర్ 15 (ప్రజా మంటలు):
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే, పక్కా సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
గత కొన్నేళ్లుగా ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో తలదాచుకుని... నాగార్జునసాగర్ ప్రభుత్వాస్పత్రిలో చిన్నారులకు ఇంజక్షన్ వికటింపు… 17 మందికి అస్వస్థత
నాగార్జునసాగర్ నవంబర్ 15 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న 17 మంది శిశువులకు ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతో వారు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో ఆస్పత్రి వాతావరణం ఒకింత గందరగోళంగా మారింది.
ఇంజక్షన్ ఇచ్చిన అరగంటలోనే లక్షణాలు
వైద్యులు... 