కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్జి,తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో జగిత్యాల జిల్లా అభివృద్ధి పరుగులు పెట్టిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాల సమయం ఇచ్చినా ఆశించిన ఫలితాలు కనిపించలేదన్నారు. ధర్మపురిలో మంజూరైన వ్యవసాయ కళాశాల ఇతర ప్రాంతానికి తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మపురి MCH 50 పడకల ఆసుపత్రి రెండేళ్లుగా పూర్తి అయి ఉన్నా ప్రారంభం చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు.
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, “ఏ అభివృద్ధి చేశారో చెప్పకుండా విజయోత్సవాలు చేసుకోవడం విడ్డూరం” అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్, హరీష్ రావు సహకారంతో జగిత్యాల జిల్లాలో విస్తృత అభివృద్ధి జరిగిందని చెప్పారు. కోరుట్ల, మెట్‌పల్లి మునిసిపాలిటీలకు TUFIDC ద్వారా రూ.15 కోట్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు. దేవస్థానాలకు నిధులు, సంఘ భవనాలు, రోడ్ల నిర్మాణాలకు కేటాయింపులు జరిగినా ప్రస్తుత ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు.
ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరత
కోరుట్ల–మెట్‌పల్లి ఆసుపత్రికి రూ.6 కోట్లతో దాదాపు పనులు పూర్తయ్యాయని, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అస్తవ్యస్థంగా మారిందని, AMC ఆధునికీకరణ చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్నారు. గతంలో లోలెవెల్ బ్రిడ్జ్‌లను హై లెవెల్ బ్రిడ్జ్‌లుగా మార్చామని, వాటిలో కొన్ని ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని విమర్శించారు.
దావ వసంత సురేష్ మాట్లాడుతూ, జగిత్యాల నియోజకవర్గంలో “అభివృద్ధి” అనే మాట ఎమ్మెల్యేకు కేవలం నినాదంగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించినా వాటిని పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
యావర్ రోడ్ విస్తరణ, మోడల్ మార్కెట్ ప్రారంభం, మెడికల్ కాలేజీ నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పూర్తి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని చెప్పారు. అభివృద్ధి పనుల కాంట్రాక్టులలో షాడో కాంట్రాక్టర్‌గా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో ఉన్నాయని తెలిపారు. పట్టణంలో స్పీడ్ బ్రేకర్లు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు.
సుంకే రవి శంకర్ మాట్లాడుతూ, 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందన్నారు. పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాన్ని ఎత్తిచూపారు. బీఆర్ఎస్ పాలనలో చొప్పదండి నియోజకవర్గానికి భారీ నిధులు, కొండగట్టు దేవస్థానం తాగునీటి శాశ్వత పరిష్కారానికి కేటాయింపులు జరిగాయని, వాటిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.
ఈ సమావేశంలో గోడిసెల రాజేశం గౌడ్, ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, లోక బాపు రెడ్డి, మారు సాయి రెడ్డి, దేవేందర్ నాయక్ రాథోడ్, శీలం ప్రవీణ్, వొళ్లెం మల్లేశం, ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు, చిట్ల రమణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఆయన నివాసం లో కలిసిన నూతనంగా ఎన్నికైన తపస్ రాష్ట్ర అధ్యక్షులు.
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసిన వోడ్నా ల రాజశేఖర్ .ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సత్కరించారు జగిత్యాల... ధనుర్మాస కొఠారి ఉత్సవాలలో భాగంగా ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవము
నిజామాబాద్ జనవరి 15 (ప్రజా మంటలు) నిజామాబాద్ లోని బ్రహ్మపురిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రథోత్సవం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. .ప్రతి ఏట సంక్రాంతి పర్వదినం నాడు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు . రథము చక్రం గుడి నుండి బయలుదేరి గాజులపేట, పెద్ద బజారు, మీదుగా ఆలయం చేరుకుంది .... జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరయ్య, అక్క మహంకాళికి బోనాల సమర్పణ
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు) జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా బీరయ్య ,అక్క మహంకాళి మాతకు కుల బాంధవులు గురువారం బోనాల సమర్పించారు .కొత్తగా వచ్చిన ధాన్యంతో స్వామివారికి బోనాలను నివేదించారు.
పిల్లాపాపలతో పాటు పశుసంపద ,గొర్రెలు, మేకలు,పాడిపంటలతో చల్లంగా ఉండాలని మొక్కుకున్నారు .ఒగ్గు కళాకారుల డోలు చప్పులతో ఆలయానికి... తెలంగాణ ప్రభుత్వం–భారత ఆర్మీ మధ్య సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం, భారత ఆర్మీకి మధ్య ఉన్న వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల సత్వర పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్... “ఒక్క క్లిక్… మీ కష్టార్జీతం మాయం!”
సికింద్రాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
వాట్సాప్ గ్రూపులలో ఫోన్ పే పొంగల్ గిఫ్ట్ “5000 రూపాయలు నిజంగా వచ్చాయి” అనే ఆశ చూపించే తప్పుడు సందేశాలతో పాటు లింకులు పంపిస్తూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల పొదుపును దోచుకుంటున్నారని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ & ఫౌండర్ డాక్టర్ వై. సంజీవ కుమార్ అన్నారు. డబ్బులు... మకర సంక్రాంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జనవరి 15 (ప్రజా మంటలు):
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ ప్రాంతంలో గల గిద్దె పెరుమాండ్ల దేవస్థానాన్ని సందర్శించారు.
ఉదయం 8:30 గంటలకు దేవస్థానానికి చేరుకున్న మంత్రి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.... మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 3 నగరాలు, 38 పురపాలికలు
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర పురపాలక శాఖ 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు సంబంధించి మేయర్లు, ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అమలులో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.... ధర్మపురిలో కాంగ్రెస్‌లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక
ధర్మపురి, జనవరి 15 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మపురి పట్టణ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్నతో పాటు మాజీ కౌన్సిలర్లు మయూరి వేణు, యూనుస్, సాంబు, స్తంభంకాడి రమేష్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి... ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు: పోచారం, కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తుది తీర్పు వెలువరించారు.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్... ‘జన నాయగన్’ కు ఎదురుదెబ్బ: నిర్మాత పిటిషన్‌ను స్వీకరించని సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జనవరి 15 (ప్రజా మంటలు):
విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా సర్టిఫికేషన్ అంశానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది.
ఈ సినిమా నిర్మాతలు తమపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడిందని, “తాము పూర్తిగా నష్టపోయాం... సంక్రాంతి సెలవుల్లో కర్ణాటక రాష్ట్ర పర్యటన చేసిన విద్యార్థులు
మెట్టుపల్లి, జనవరి 15 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్)
సంక్రాంతి సెలవుల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల విద్యార్థులు విద్యా, వైజ్ఞానిక, విహార యాత్రలో భాగంగా ఈ నెల 10 నుంచి ఆరు రోజుల పాటు కర్ణాటక రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ... జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని... 