నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
రాజకీయాల్లోకి తాను వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిని కోరడంతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలు మంజూరైన సమయంలో జగిత్యాల పేరు జాబితాలో ఉండేలా కృషి చేశానని చెప్పారు. రాష్ట్రంలో మొదట అనుమతి పొందిన మెడికల్ కాలేజీ జగిత్యాలదేనని పేర్కొన్నారు.
తనకు ఉన్న అనుభవంతో హెల్త్ సెక్రటరీతో చర్చించి విద్యార్థుల మేలు కోసం అవసరమైన వసతులు, బోధన సిబ్బందిని సమకూర్చినట్లు తెలిపారు. మెడికల్ కాలేజీ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.500 కోట్లు అవసరమవుతాయని చెప్పారు.
కాలేజీ భవన నిర్మాణానికి రూ.119 కోట్లతో పనులు ప్రారంభించామని, 2023 వరకు కాంట్రాక్టర్ రూ.60 కోట్ల విలువైన పనులు చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం నుంచి కేవలం రూ.14.70 కోట్లే నిధులు వచ్చాయని తెలిపారు. నిధుల కొరత కారణంగా పనులు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసి, ఇప్పటికే పూర్తయిన పనులకు రూ.40 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ప్రస్తుతం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మెడికల్ విద్యార్థులు ఫైనల్ ఇయర్‌కు వచ్చేలోపు ఆస్పత్రి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
230 పడకల నూతన ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు. కోరుట్లలో ఆస్పత్రుల్లో సరైన వసతులు లేక రోగులు జగిత్యాల ఆస్పత్రికి రావాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కోరుట్లలో ముందుగా 30 పడకల ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని, ఆ తర్వాత 100 పడకల ఆస్పత్రి మంజూరు చేయాలని, మెట్‌పల్లి ఆస్పత్రికి మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.
కోరుట్ల ఎమ్మెల్యేతో సమస్య ఉంటే తన వద్దకు రావచ్చని, ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి, ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. కోరుట్ల పేషెంట్లు జగిత్యాలకు రావడం అక్కడి పరిస్థితిని స్పష్టంగా చూపుతోందన్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో 14 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోళ్లవాగు ప్రాజెక్టుకు గేట్లు ఏర్పాటు చేయాలంటే 52 వేల చెట్లు నాటాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం గేట్లు బిగిస్తే అటవీ ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జగిత్యాలకు తెలంగాణలోనే అత్యధిక నిధులు మంజూరయ్యాయని, అభివృద్ధి ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం అడువాల జ్యోతి లక్ష్మణ్ గోలి శ్రీనివాస్ నాయకులు క్యాదసు నాగయ్యా చెట్పల్లి సుధాకర్ బద్దం జగన్ మోహన్ రెడ్డి కుసరి అనిల్ పంబల రాము బోడ్ల జగదీష్ ఎఫ్ సి ఎస్ ఛైర్మెన్ గుమ్ముల అంజయ్య దుమాల రాజ్ కుమార్ శరత్ రావు కోరే గంగమల్లు ప్రభత్ సింగ్ ఠాగూర్ కూతురు రాజేష్ క్యాదసు నవీన్ అహమ్మద్ రామకృష్ణ రెడ్డి జి.వేణు ఏనుగుల రాజు గట్టు రాజు ఈశ్వర్ గౌస్ జంగిలి శశి చిట్ల మనోహర్ రహీం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు)
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి... పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు
జగిత్యాల మార్చి 2 ( ప్రజా మంటలు)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతిని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు.
నైతిక విలువలు, ప్రజల పట్ల... పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు):
హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి... ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు
కరీంనగర్, మార్చి 02 (ప్రజా మంటలు):
మాజీ శాసనసభ స్పీకర్, అజాతశత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు... మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్‌కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ / న్యూఢిల్లీ మార్చ్ 02 (ప్రజా మంటలు):
అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం... తెలంగాణ విద్యా కమిషన్‌పై వివాదం: అర్హతలే ప్రశ్నార్థకమా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రయోగాలా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం–2026” నివేదిక రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కమిటీకి పరిపాలనా అనుభవం ఉన్నవారు ఉన్నప్పటికీ, స్కూల్ లేదా యూనివర్సిటీ స్థాయిలో బోధన అనుభవం ఉన్న అసలైన విద్యావేత్తలు లేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రేవంత్ రెడ్డి... కుమ్మెర గ్రామం చిన్నారి మృతికి రజక సంఘం నిరసన కొవ్వొత్తులతో నివాళి
జగిత్యాల మార్చి 1(ప్రజా మంటలు)కుమ్మెర గ్రామంలో చిన్నారి మృతికి రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చింతకుంట వద్ద గల ఐలమ్మ విగ్రహం ముందునిరసన వ్యక్తం చేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కుమ్మెర గ్రామంలో జాతరలో జరిగిన సంఘటనను నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం చేసినట్లు తెలిపారు ఇలాంటి... అర్హత లేమి, పారదర్శకత లోపం, విద్యా భవిష్యత్తుపై ముప్పు
కరీంనగర్ మార్చ్ 01 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక రాష్ట్ర విద్యావ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన సందేహాలు రేకెత్తిస్తోందని, TRSMA రాష్ట్ర గౌరవాధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు విమర్శించారు.
కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా, విద్యా విధాన రూపకల్పనలోని మౌలిక లోపాలను ఎత్తిచూపుతున్న గంభీర హెచ్చరికగా
ఆయన... ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 11వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 6 వ రోజు, చివరి రోజు అయిన ఆదివారం ఉదయం సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, అష్టోత్తర శత కలశాభిషేకం, మహా పూర్ణాహుతి, విమానోపరి కుంభాభిషేకం, చక్ర... మహిళా పోలీస్ సిబ్బందికి ఫ్రీ హెల్త్ క్యాంప్, క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు
జగిత్యాల మార్చ్ 1(ప్రజా మంటలు)మహిళలలో వచ్చే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్‌ను ముందస్తుగా ఏవిదంగా గుర్తించడం మరియు ఈ యొక్క క్యాన్సర్ లు రావడానికి గల కారణాలు, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో స్థానిక ఐ... జగిత్యాల వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ఎన్నిక
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జగిత్యాల నూతన వీర శైవ సమాజం అధ్యక్షుడుగా కంది కైలాసం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా హద్దునూరి నాగేంద్రం ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షులుగా ములస్తం శివకుమార్ ఉపాధ్యక్షులుగా సూరం వీరయ్య గుంటిమట్టం నిరంజన్ కోశాధికారిగా సిద్ధాంతి శ్రీనివాస్ మరియు సంయుక్త కార్యదర్శిగా వూడే అవంతిక అంగడి మఠంవీర... ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చ్ 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో పద్మశాలి కిట్టి పార్టీ వేడుకలలో భాగంగా ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజలన గావించి, కార్యక్రమాలు ప్రారంభించారు.
మహిళలు ఆటపాటలతో అల రించారు. రోజంతా సందడి నెలకొందని సామాజిక కార్యకర్త తవుటు... 