రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వం.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు
పదేళ్ల కాలంలో రైతులకు బీ.ఆర్.ఎస్. చేసిందేమీ లేదు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి
హైదరాబాద్ ఫిబ్రవరి 11:
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తోందని, రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర కాలంలోనే రైతుల సంక్షేమం కోసం రూ. 55,256 వేల కోట్లు వ్యయం చేసిందని చిన్నారెడ్డి తెలిపారు. రైతు భరోసా ద్వారా సుమారు రూ. 40 వేల కోట్లు రైతుల ఖాతాలో నేరుగా జమ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని చిన్నారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి పంట కాలంలో 25 లక్షల 36 వేల మంది రైతులకు రూ. 20,617 వేల కోట్లు రుణ మాఫీ చేసిందని చిన్నారెడ్డి తెలిపారు.
రైతులకు మంచి చేయాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం తపిస్తోందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, రైతుల కోసం చేసింది ఏమీ లేదని చిన్నారెడ్డి ఆరోపించారు.
అధికారం కోల్పోయిన తర్వాత బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని చిన్నారెడ్డి అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్‌పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
