జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 11 ( ప్రజామంటలు):
బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యునిటీ హాలులో మంగళవారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైయిన్ బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్, జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో హబ్సీగూడ లోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో జరిగిన ఈ శిబిరాన్ని కార్పొరేటర్ కే హేమలత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి చూపు ఎంతో ముఖ్యమైనదని ప్రతి ఒక్కరూ కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. ఈ శిబిరంలో నేత్ర వైద్యులు 200 మందికి కంటి చూపును పరీక్షించారు. అందులో 30 మందికి కేటరాక్ట్ ఆపరేషన్ కోసం సిఫారసు చేశారు. ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ పూర్ణచందర్, జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధి నర్సింహ మూర్తి, నర్సింగ్ రావు, రెయిన్ బో హోమ్స్ ప్రోగ్రాం నగర కోఆర్డినేటర్ క్రాంతి కిరణ్, పీపుల్స్ కలెక్టివ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రతినిధి అంబిక, ప్రాజెక్ట్ ఇన్చార్జి సుజాత, సిబీసీ కోఆర్డినేటర్ లు సంధ్యారాణి, నాగభూషణం, రామస్వామి, రాజు, టీచర్ వెంకటలక్ష్మి కళావతి పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
