సమాజాన్ని మార్చే శక్తి ఫొటోగ్రఫీకి ఉంది. * డాక్టర్ కోట నీలిమా
సమాజాన్ని మార్చే శక్తి ఫొటోగ్రఫీకి ఉంది.
* డాక్టర్ కోట నీలిమా
సికింద్రాబాద్ ఫిబ్రవరి 10 (ప్రజామంటలు) :
ఒక్కో ఫోటో వెనుక ఓ కథ ఉంటుందని. కొన్ని ఛాయ చిత్రాల దృశ్యాలకు మనసును కదిలించే శక్తి కలిగి ఉంటాయి. ఫోటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాదు, కొన్ని సార్లు అది సమాజాన్ని మార్చే ఓ గొప్ప శక్తిగా మారుతుందని ప్రముఖ రాజకీయవేత్త, రచయిత్రి,కళాకారిణి డా. కోటా నీలిమ అన్నారు. ఆమె హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ‘గాలేరియా 2025’ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఫోటోగ్రఫీ సొసైటీ ( టీపీఎస్) నిర్వహించిన ఈ ఐదు రోజుల వార్షిక ప్రదర్శన ఫిబ్రవరి 7 నుండి 11 వరకు కొనసాగనుంది. డా. కోటా నీలిమకు వీవీఎస్ శర్మ, కార్యదర్శి ప్రశాంత్ మంచికంటి , సత్యప్రసాద్, హరీష్, కృష్ణన్ కల్పత్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా. నీలిమ మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ ద్వారా సంస్కృతి పరిరక్షణ, చరిత్ర డాక్యుమెంటేషన్, సామాజిక మార్పుకు నాంది పలికే విధంగా ఉంటుంది అని తెలిపారు. ఫోటోగ్రఫీ కళను ప్రోత్సహిస్తూ టీపీఎస్ అందిస్తున్న వేదికను ఆమె ప్రశంసించారు. ఈ ప్రదర్శనలో భాగస్వామ్యమైన ప్రతి ఫోటోగ్రాఫర్‌కు నా అభినందనలు,” అని ఆమె అన్నారు. ఈ ప్రదర్శనలో ఆచార సంప్రదాయాలు, ప్రకృతి, సమకాలీన సామాజిక సమస్యలు వంటి విభిన్న అంశాలను ప్రదర్శించే అద్భుత చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి. హైదరాబాద్ కళా ప్రేమికులు, విద్యార్థులు, ఫోటోగ్రఫీ అభిమానం కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను సందర్శించి ఆస్వాదించాలని కోరారు. ప్రదర్శన ఫిబ్రవరి 11, 2025 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఫొటోగ్రఫీ ప్రేమికులు, కళాభిమానులు, యువ ప్రతిభావంతులు తప్పకుండా సందర్శించి వీక్షించవచ్చని ఆర్గనైజర్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
