మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

On
మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

మంజూరైన నవోదయ విద్యాలయాన్ని తరలించొద్దు 
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఫిబ్రవరి 10:

 తాము కష్టపడి తెచ్చుకున్న కేంద్ర ప్రభుత్వ నవోదయ విద్యాలయాన్ని, అడ్డుకుని, తరలించి, తమ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నాలు మానుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ధర్మపురిలో తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం ఆధారంగా జిల్లాలకు నవోదయ విద్యాలయాలను మంజూరు చేసే కార్యక్రమంలో భాగంగా...రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు కోరిన సందర్భంలో అప్పుడే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ ద్వారా 24.7.2024 నాడు తమ విజ్ఞప్తి ప్రకారం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో 252 సర్వే నెంబర్ లో 30 ఎకరాల భూమి ఉంది నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. 22.8.24 నాడు రాష్ట్ర సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. 
కేంద్ర ప్రభుత్వం 18 నవోదయ స్కూల్ని మంజూరు చేయగా, ధర్మపురి మండల లోని నేరేళ్ల గ్రామంలో విద్యాలయ ఏర్పాటుకు మంజూరు ఇవ్వడం జరిగిందన్నారు.
కొత్త భవనం నిర్మాణం చేసేంత వరకు ధర్మపురిలోని ఎస్టీ హాస్టల్లో ను వాడుకోవాలని నిర్ణయించి, నవోదయ విద్యాలయ అధికారులు కూడా వచ్చి చూడటం జరిగిందని,త్వరలో తరగతులు ప్రారంభం చేయడం జరుగుతుందని వివరించారు. నవోదయ విద్యాలయాన్ని ధర్మపురి నియోజకవర్గానికి మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, పీఎం మోడీకి, సిఎం రేవంత్ రెడ్డికి, ఎంపీ అరవింద్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇదిలా ఉండగా...
గత 10 రోజుల క్రితం ఎంపి అరవింద్  నవోదయ విద్యలయాన్ని, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధి లోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాశారన్నారు 
జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని,  మన ధర్మపురికి నవోదయ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చిన తర్వాత  దాన్ని తరలించాలని చూడటం ఎంత వరకు సమంజసం అని ఎంపీ అరవింద్ ను ప్రశ్నించారు.
తనకు భేషజాలు లేవని, దీనిపైన ప్రధాన మంత్రికి వినతి పత్రం సమర్పించి, సమయం దొరికితే తప్పకుండా వారిని కలుస్తానన్నారు. వెంటనే డిల్లీ వెళ్లి నేరుగా అరవింద్ ను, అదే విధంగా సంబంధిత నవోదయ శాఖ అధికారిని కలిసి వినతి పత్రాన్ని అంద చేస్తా మన్నారు.
 సానుకూలమైన స్పందన లేకపోతే వచ్చిన తర్వాత కార్యచరణ ప్రకటిస్తామాన్నారు. .నవోదయ విషయంలో ఎక్కడ వెనుకను తగ్గే ప్రసక్తే లేదని, అఖిల పక్ష నేతల సహకారం కోరతామన్నారు. 
పీసీసీ సభ్యులు సంగన భట్ల దినేష్, నాయకులు కుంట సుధాకర్, వేముల రాజేశ్, జక్కు రవీందర్, చిలుముల లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేశ్, సింహరాజు ప్రసాద్, రఫీయుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
Tags
Join WhatsApp

More News...

Local News 

గాంధీ జయంతి సందర్భంగా రంగధామునిపల్లిలో పలు కార్యక్రమాలు

గాంధీ జయంతి సందర్భంగా రంగధామునిపల్లిలో పలు కార్యక్రమాలు గొల్లపల్లి, అక్టోబర్ 2 (ప్రజా మంటలు): గాంధీ జయంతి సందర్భంగా రంగధామునిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టనున్న పనులపై గ్రామసభ నిర్వహించారు. గ్రామ...
Read More...
Local News 

ఉత్తమ ఉపాధ్యాయులకు అవొపా ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు అవొపా ఘన సన్మానం ధర్మపురి, అక్టోబర్ 2 (ప్రజా మంటలు): గాంధీ జయంతిని పురస్కరించుకుని ధర్మపురి పట్టణంలోని ఆర్య వైశ్య సంఘ సమావేశ మందిరంలో అవోపా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన కూరగాయల చంద్రశేఖర్, జగిత్యాల జిల్లా స్థాయిలో అవార్డు పొందిన దోంతుల శ్రీధర్,...
Read More...
Local News 

తెలంగాణ ఉద్యమ కళాకారుడు రాజోజు మధు హౌస్ అరెస్ట్

తెలంగాణ ఉద్యమ కళాకారుడు రాజోజు మధు హౌస్ అరెస్ట్ ఎల్కతుర్తి, అక్టోబర్ 2 (ప్రజా మంటలు): ఉద్యోగాల సాధన కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మద్దతు తెలిపిన తెలంగాణ ఉద్యమ కళాకారుడు రాజోజు మధును ఎల్కతుర్తి పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజోజు మధు, తెలంగాణ ఉద్యమ కళాకారులు, ఉద్యోగ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో...
Read More...
Local News 

వల్భాపూర్ యూపీఎస్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ గెట్‌టుగెదర్

వల్భాపూర్ యూపీఎస్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ గెట్‌టుగెదర్ ఎల్కతుర్తి, అక్టోబర్ 2 (ప్రజా మంటలు): ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వల్భాపూర్ యూపీఎస్ పాఠశాలలో 1991–92 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి చదివిన 55 మంది పూర్వ విద్యార్థులు గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఆత్మీయ గెట్‌టుగెదర్ నిర్వహించారు. సూరారం పెట్రోల్ బంకు సమీపంలోని చిన్న పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ...
Read More...
Local News 

లోతట్టు ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

లోతట్టు ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి ఎల్కతుర్తి, అక్టోబర్ 2 (ప్రజా మంటలు): ఎల్కతుర్తి గ్రామంలో శుక్రవారం సర్పంచ్ మునిగడప లావణ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో లోతట్టు ప్రాంత కుటుంబాలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు DRDA అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్, స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబాల జగన్ మాట్లాడుతూ.. ఎత్తైన ప్రాంతాల...
Read More...
Local News 

జగిత్యాల లలో జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన.  

జగిత్యాల లలో జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన.   జగిత్యాల,అక్టోబర్ 2(ప్రజా మంటలు) జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు   చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి లు  డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల మంచినీళ్ల...
Read More...
State News 

బాపూ ఘాట్‌లో గాంధీజీకి గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

బాపూ ఘాట్‌లో గాంధీజీకి గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి నివాళులు హైదరాబాద్, అక్టోబర్ 02 (ప్రజా మంటలు): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గాంధీజీకి నివాళులర్పించారు. మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం బాపూ ఘాట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను గవర్నర్‌తో...
Read More...
Local News 

సిరిసిల్ల సభ విజయాన్ని జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ నేతల అక్కసు

సిరిసిల్ల సభ విజయాన్ని జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ నేతల అక్కసు కేటీఆర్‌కు మూడు హోటళ్లు ఎక్కడివి? సమాధానం చెప్పాలి: కొరివి అరుణ్ కుమార్
Read More...
Local News 

గాంధీ జయంతికి రక్తదాన శిబిరం

గాంధీ జయంతికి రక్తదాన శిబిరం బంజారాహిల్స్ అక్టోబర్ 02 (ప్రజా మంటలు): గాంధీ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు,...
Read More...
Local News 

పద్మారావు నగర్ లో మహాత్మా గాంధీకి ఘన నివాళి -చిన్నారులకు పండ్ల పంపిణీ

పద్మారావు నగర్ లో మహాత్మా గాంధీకి ఘన నివాళి -చిన్నారులకు పండ్ల పంపిణీ సికింద్రాబాద్, అక్టోబర్ 02 (ప్రజా మంటలు): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని పద్మారావు నగర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, పద్మారావు...
Read More...
Local News 

జగిత్యాలలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

జగిత్యాలలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జగిత్యాల, అక్టోబర్ 2 (ప్రజా మంటలు): జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని పురాణిపేట, మంచినీళ్ల బావి, గాంధీనగర్ ప్రాంతాల్లో గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గజెంగి నందయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ సేవలను స్మరించుకున్నారు. సత్యం,...
Read More...
Local News 

గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి: దావ వసంత సురేష్

గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి: దావ వసంత సురేష్ జగిత్యాల, అక్టోబర్ 2 (ప్రజా మంటలు): గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని 44వ వార్డులో మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ అహింసా మార్గంలో...
Read More...