రాజకీయాలకు అతీతంగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి* బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
*
మల్యాల ఫిబ్రవరి 9( ప్రజా మంటలు )
బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలుపెట్టిన కొండగట్టు అభివృద్దిని రాజకీయాలకు అతీతంగా కొనసాగించాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండగట్టు అభివృద్ధికి రూ. 1000 కోట్లతో కేసీఆర్ ప్రణాళిక వేశారని, దాన్ని యధాతథంగా లేదా మరింత మెరుగైన ప్రణాళికను రూపొందించాలని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
ఆదివారం నాడు ఎమ్మెల్సీ కవిత కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే క్షేత్రంపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టిపెట్టాలని, కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని ప్రభుత్వాన్ని కోరారు. కొండగట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. రూ 25 కోట్లు ఖర్చు చేసి కొండపై నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని, ఎస్సారెస్పీ నీటితో కొండపై రెండు ట్యాంకుల్లో నింపడానికి కనెక్షన్ ఇప్పించామని గుర్తు చేశారు. దేవుడి భూములను కాపాడడానికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
