బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా - అడ్లూరి
బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా
- ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఫిబ్రవరి 08: ఎస్సి వర్గీకరణ, బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో తాను ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి నియోజక వర్గ కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన పాలాభిషేక కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం మీడియా ప్రతినిధులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎస్సీ ల ముపై ఏళ్ల ఆకాంక్ష వర్గీకరణ అసెంబ్లిలో ఆమోదించిన ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం దళిత వర్గానికి చెందిన వాడిగా చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని, తన నాయకుడు కోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే అసెంబ్లీలో ఆమోదించారన్నారు.ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని కమిటీని నియమించి కమిటీ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని సేకరించి కులగణన చేయడం జరిగిందన్నారు
మాజీ జస్టిస్ ఏకసభ్య సభ్య కమిటీ చైర్మన్ గా షబీబ్ ముక్తాల్ ను నియమించి వారి నివేదిక ద్వారా అసెంబ్లీలో చర్చించడం జరిగిందని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ బీసీ కుల గలన చేయలేదని, అది తమ ప్రభుత్వమే చేసిందని, ఎస్సీ వర్గీకరణ బిసి కుల గణన అసెంబ్లీ చర్చలో తాను ఉండడం తన అదృష్టంగా భావిస్తున్న ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా అన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం మందకృష్ణ మాదిగ ఉద్యమాన్ని అణిచివేసిందని, అంతేకాకుండా మందకృష్ణ మాదిగను జైలు కూడా పంపించిన సందర్భం ఉందన్నారు. నియోజక వర్గ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
