22 ఏళ్లుగా అద్దెకున్న వృద్ధురాలికి తెలియకుండానే సామాన్లు బయటపడేసిన యజమాని
22 ఏళ్లుగా అద్దెకున్న వృద్ధురాలికి తెలియకుండానే సామాన్లు బయటపడేసిన యజమాని
దోమకొండలో దారుణం - పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు
సహాయం కొరకు ఎదురుచూపులు
కామారెడ్డి ఫిబ్రవరి 03:
ఓకే ఇంట్లో 22 సంవత్సరాలుగా కిరాయి చెల్లిస్తూ, అద్దె కుంటున్న రిటైర్మెంట్ ఉద్యోగి తుమ్మగళ్ళ బాలమణి తన ఇంటి సామాగ్రిని ఇంటి బయట పడవేసి బలవంతంగా ఇల్లు కాళీ చేయించారని వాపోతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో ఉంటున్న బాలమణి తనకు తెలియకుండానే తను ఉంటున్న ఇంటి సామాగ్రిని ఇంటి యజమాని పోగుల రవి బయట పడవేసి, ఇబ్బందులకు గురి చేస్తున్నదని బలమని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా తుమ్మగల బాలమణి మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా విధులు నిర్వహించడం జరిగిందని, అప్పటినుండి ఇంటి యజమాని అయిన వల్ల కట్టి నరసయ్య ముంబైలో ఉంటున్నాడని ఈ ఇంట్లో నేను అద్దెకు ఉండడం జరుగుతుందని, అప్పటినుండి ప్రతినెల అద్దె కూడా కట్టడం జరిగిందని తెలిపారు
నాలుగైదు సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి తనకు (బాలమణి) కొడుకును అవుతానని చెప్పి ఈ ఇల్లును కొనుగోలు చేయడం జరిగిందని, ఇట్టి విషయం పైన బిక్నూర్ పోలీస్ స్టేషన్ సిఐ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. నేనే ఈ ఇల్లును కొనుగోలు చేసుకుంటానని, ఇదివరలో రెండు మూడు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు మరమత్తులు చేసుకోవడం జరిగిందని, కనీసం నేను మనమత్తులు చేసిన డబ్బులు ఇవ్వాలని పోలీస్ స్టేషన్లో కూడా చెప్పడం జరిగిందని అయినా నాకు ఎవ్వరూ న్యాయం చేయడం లేదని విలపించారు.
నేను ఖర్చుపెట్టిన డబ్బులు ఇవ్వకుండానే, తన సొంత సామాగ్రిని మొత్తం ఇంటి బయట పాడేయడం జరిగిందని, జిల్లా అధికారులు తనకు న్యాయం చేయాలని బాలమణి ఆవేదనతో విన్నవించుకొంటున్నది.
గత ఆరు రోజులుగా నా సామాగ్రి మొత్తం ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొ అంటూ బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దయచేసి నాకు అధికారులు న్యాయం చేయగలరని ఆమె వేడుకుంటున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.
