బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల

జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు )
భారతీయ జనతా పార్టీ "సంవిధాన్ గౌరవ అభియాన్" కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కార్యశాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 26 నవంబర్ 2015 న తొలిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ మనం రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్నాం దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం అత్యంత పవిత్రమైనది. సర్వోన్నతమైనది. గతంలో భారత రాజ్యాంగం 75 వ వార్షికోత్సవం పై పార్లమెంట్ ఉభయ సభలో సమగ్ర చర్చ జరిగింది ప్రధాని మోడీ నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవార్థం అభివృద్ధితో పాటు పేదలు అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా అనేక కార్యక్రమాలు నిరంతరం జరుగుతూన్నాయి. రాజ్యాంగ 75 వ వార్షికోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో చేసిన ప్రసంగం మనందరికీ స్ఫూర్తిదాయకం ప్రతి కార్యకర్తల విషయాన్ని సామాన్య ప్రజలకు చేరువేయాలి అనే ఉద్దేశంతో బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఆదేశాల మేరకు జనవరి 11 నుండి 25 వరకు "సంవిధాన్ గౌరవ అభియాన్" అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించి ప్రతి భారతీయ పౌరుడు కి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి బాబు, రగిల్ల సత్యనారాయణ,జిల్లా కార్యదర్శి జంబర్తి దివాకర్, పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివం మరియు జిల్లా పదాధికారులు మండల పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటల):
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.252లోని నిబంధనలు వేలాది మంది జర్నలిస్టుల ఉపాధికి ముప్పుగా మారాయని ఆరోపిస్తూ, శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు... అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి యుట్యూబ్ ఛానల్,భక్తి పాట ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు)అర్బన్ మండల అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి మీద రూపొందించిన భక్తి పాట ను, శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ చానల్ నుజగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ భక్తి పాట రూపొందించడానికి కృషి చేసిన పాట రచన సిరికొండ... అల్లిపూర్ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపిన తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల (రూరల్),డిసెంబర్ 27 ప్ర(జా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎంబరీ గౌతమి, ఉపసర్పంచ్ వినయ్లతో పాటు వార్డు సభ్యులుగా ఎన్నికైన మహిళలు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ వారిని శాలువాలతో సత్కరించి... అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భక్తి పాటను, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ ఛానల్ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది.
భక్తి పాట రూపకల్పనలో కీలకంగా పనిచేసిన... సారంగాపూర్లో మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ వేడుకలలో ఎమ్మెల్యే డా సంజయ్
సారంగాపూర్, డిసెంబర్ 27 – ప్రజా మంటలు:
సారంగాపూర్ మండలం రంగంపేట గ్రామ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలోజు వేణుగోపాల్ – శోభ దంపతులను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ... ఆరుసార్లు గెలిచి! మళ్ళీ రాజీనామా చేసి, గెలుస్తా దానం ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ, అవసరమైతే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.
శుక్రవారం... జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రజారోగ్య సేవల్లో అంకితభావంతో పనిచేసిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్, విధి నిర్వహణలో నిబద్ధత, మానవీయత... ఎన్.సి.సి. (NCC) ఆర్.డి (Republic Day) పరేడ్ కు ANO గా మన జగిత్యాల వాసి చేని.మంగ
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.
జగిత్యాల/ హైదరాబాద్ డిసెంబర్ 27 (ప్రజా మంటలు) :
జనవరి 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో లో తెలంగాణ నుండి NCC క్యాడేట్స్ తో పాటు జగిత్యాలకు మౌంట్ కార్మెల్ స్కూల్ కు చెందిన అసోసియేట్ NCC ఆఫీసర్ పాఠశాల పి.ఈ.టి (వ్యాయామ ఉపాధ్యాయురాలు)... అధికారిక–వృత్తి సంఘం (GOPA) స్వర్ణోత్సవ వేడుకలు
హైదరాబాద్, డిసెంబర్ 26 (ప్రజా మంటలు):
గౌడ్ అధికారిక మరియు వృత్తి సంఘం (GOPA) 50వ వార్షికోత్సవ వేడుకలు కాచిగూడ, హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు హాజరై సంఘానికి అభినందనలు తెలిపారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ నెర్రెల్ల... జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని నుంచి అంజన్న స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తుల ఆటో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న సైడ్వాల్ను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాద... 