రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి - ఎమ్మెల్సీ కవిత
రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి
లబ్దీదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు
- ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ జనవరి 19:
పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలక్టరేట్ లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై కీలక అంశాలను ఎమ్మెల్సీ కవిత లేవనెత్తారు.నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 1.2 లక్షల మంది మీ సేవ ద్వారా దరఖాస్తు చేశారు
కానీ కులగణన ఆధారంగా కేవలం 26 వేల మందికే రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం.కేవలం 20 శాతం మందికే రేషన్ కార్డులు ఇస్తామనడం అన్యాయంఅని ఆమె అన్నారు.
రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి. రేషన్ కార్డుల ఆదాయపు పరిమితిని గ్రామీణ ప్రాంతాలల్లో 2.5 లక్షలకు, పట్టణ ప్రాంతాలో 3.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలి.
ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఆగిపోయిన ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాలి. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలి.
4.43 లక్షలకుపై రైతు కూలీలు ఉంటే... ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కేవలం 41 వేల మందికే పథకం వర్తింస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కేవలం 10 శాతం భూమి లేని రైతు కూలీలకు ఇవ్వడం సరికాదు. కేవలం కంటితుడుపుగా పథకం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది
పేదల పట్ల సానుభూతితో ప్రభుత్వం ఆలోచించాలి.ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు విడుదల చేయాలని రైతు భరోసా పథకాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలని,ఏ రైతుకు రైతు భరోసా నిధులను ఎగవేసే ప్రయత్నం చేయవద్దని,రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15 వేల ఇస్తామని... 12 వేలకు ప్రభుత్వం కుదించిందని ఆమె అన్నారు.
ఇచ్చిన హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 40 శాతమే అమలు చేసినట్లు లెక్క. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కౌలు రైతుల సంబంధించిన లెక్కలు తీశారా ?
కౌలు రైతులకు సాయం చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా ?అన్ని పథకాలకు లబ్దీదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి
లబ్దీదారుల ఎంపికలో రాజకీయ జోక్యం తగదు
గ్రామ సభల ద్వారా లబ్దీదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాబట్టి గ్రామ సభల సమావేశం సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలి
నిజామాబాద్ జిల్లాలో మైనారిటీల పథకాలను అమలు చేయడం లేదు.కాళేశ్వరం ప్యాకేజీ 21ఏ పనులను పూర్తి చేయాలి.
దాశరథి శతజయంతి ప్రభుత్వమే నిర్వహించాలి
దాశరథి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి.దాశరథిని పెట్టిన నిజామాబాద్ పాత జైలులో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. పోలీస్ కమిషనర్ లేక నిజామాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.శాంతి భద్రతల విషయంలో రాజీపడడం సరికాదు.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
