శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు
శ్రీరాములపల్లిలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి అవగాహన సదస్సు
గొల్లపల్లి జనవరి 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామం లో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించడానికి జిల్లా లోని ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ఆయిల్ పామ్ పంట మీద అవగాహన సదస్సును నిర్వహించడం ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన అధికారి దేవ ప్రసాద్ మాట్లాడుతూ గొల్లపల్లి మండలంలో ఇదివరకే 310 ఎకరాలలో ఆయిల్పామ్ సాగును చేపట్టడం జరిగిందని ఆయన కొని ఆడారు. కొత్తగా ఆయిల్ పామ్ పంట సాగు చేయడానికి ముందుకు వచ్చే రైతులకు చెట్లను 90 శాతం సబ్సిడీ పై, డ్రిప్ పరికరాలను BC, సన్న చిన్న రైతులకు 90 శాతం ఎస్సీ, ఎస్టి రైతులకు 100 పర్సెంట్ సబ్సిడీ, OC పెద్ద రైతులకు 80% సబ్సిడీ మీద అందించడం జరుగుతుందని ఆయన మాట్లాడారు.ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతులకు ఆయన తగిన సలహాలు సూచనలు చేశారు ఆయిల్ సాగు చేస్తున్న రైతులు కోకో పంటను అంతర పంటగా వేయాలని ఆయన కోరారు కోకో పంట సాగుతో 2 లక్షల నికర ఆదాయం ఎకరానికి పొందవచ్చు అని ఆయన సూచించారు. ఆ తర్వాత జగిత్యాల్ నియోజకవర్గ ఉద్యాన అధికారి కందుకూరి స్వాతి ,మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల్లో మొదటి 3 సంవత్సరాలు వరి తప్ప మిగతా పత్తి, మొక్కజొన్న, పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయలు అంతరపంట లుగా వేసుకోవచ్చని, తోట నిర్వహణ నిమిత్తం ఒక ఎకరానికి సంవత్సరనికి రూ. 4200/- చొప్పున 4 సంవత్సరాల వరకు రైతుకు ఇవ్వబడునని తెలిపారు.ప్రస్తుతం ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 20,500/- ఉందని, ఎకరానికి ప్రతి సంవత్సరం కనీసం రూ. 1,00,000/- నికర ఆదాయం పొందవచ్చని తెలిపారు.
లోహియా కంపెనీ తరఫున జిల్లా మేనేజర్ విజయ్ భరత్ , మాట్లాడుతూ ఆయిల్ పామ్ కొత్తగా చేపట్టే రైతులకు పంట సాగు గురించి వివరించారు అదేవిధంగా ఇదివరకే పంట సాగు చేపట్టిన వారికి సలహాలు పలు సూచనలు
చేశారు
బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో ఫ్యాక్టరీ నెలకొలపుతున్నామని, రైతు పండించిన గెలలని 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం కంపెనీ కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబడునని తెలిపారు.అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ, మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని సూచించారు. రైతులు మట్టి నమూనా పరీక్ష నివేదికను అనుసరించి ఎరువులు వేయాలని తెలిపారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను చూసానని, అది లాభసాటి పంట అని అందరు వేయాల్సిందిగా కోరారు.ఇట్టి సమావేశంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి శ్రీ దేవప్రసాద్ ,మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ ,ఉద్యాన అధికారి కె. స్వాతి,ఏ ఈ ఓ వంశీకృష్ణ ,లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయభరత్, లోహియా సిబ్బంది సంజీవ్, అన్వేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, ఇతర రైతులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం
