ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)
ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.
ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా, ద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు.
దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ , క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.
భారీ ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి.
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. 
ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు.
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..? ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.
జగిత్యాల, జనవరి 24 (ప్రజా మంటలు)
40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు.
శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్,... టీ-హబ్ స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
టీ-హబ్‌ను పూర్తిగా స్టార్టప్‌ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు.
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు... నోబెల్ శాంతి బహుమతి నిర్లక్ష్యమే గ్రీన్‌ల్యాండ్ అంశంపై వ్యాఖ్యలకు కారణమా?
అమెరికా రాజకీయాల్లో మరో వివాదాస్పద ప్రకటన
వాషింగ్టన్ జనవరి 24:
గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న గత వ్యాఖ్యల వెనుక కారణం నోబెల్ శాంతి బహుమతి అందకపోవడంపై అసంతృప్తినేనని అమెరికా మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
తాను అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు... నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దు: సీపీ సజ్జనార్
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
నాంపల్లి ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో ప్రజలు **నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్)**కు రావద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు స్పష్టంగా సూచించారు. ఈరోజు నుమాయిష్ సందర్శనను వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నీచర్ షోరూమ్ గోదాంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.... మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి?
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతూ, తెలంగాణ జాగృతి పార్టీ చీఫ్ కవిత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తుద నిర్ణయం తీసుకున్నారు. స్థానిక రాజకీయాల్లో తన ఉనికిని ఘాటుగా చాటేందుకు, పార్టీ అభ్యర్థులను సింహం గుర్తుతో బరిలో నిలపనుంది.
పార్టీకి శాశ్వత గుర్తింపుగా సింహం గుర్తును ప్రజల్లో... పంటల ధర నిర్ణయ అధికారం రైతులకే ఉండాలి
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):పంటల ధరలను నిర్ణయించే అధికారం రైతులకే ఉండాలని, మార్కెట్లో జరిగే మోసాలను నియంత్రించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్పష్టం చేశారు.శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ శాఖ రిటైర్డ్ అధికారుల సంఘం రాష్ట్ర... ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవా తత్పరుడు కాసుగంటి సుధాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తి
జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)ప్రముఖ విద్యావేత్త,సామాజిక వేత్త,పారిశ్రామిక వేత్త సరస్వతీ శిశు మందిర్, శ్రీవాణి జూనియర్ కళాశాల ఛైర్మెన్ కాసుగంటి సుధాకర్ రావు ప్రథమ మాసికం( సంస్మరణ ) కార్యక్రమానికి పద్మనాయక కళ్యాణ మండపానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వ్యవసాయ... నాంపల్లి రోడ్లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నాంపల్లి రోడ్‌లోని ఓ బహుళ అంతస్తుల ఫర్నిచర్ షాప్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు మంటల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫర్నిచర్ షాప్‌కు చెందిన సెల్లార్లో ముందుగా అగ్ని... అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల
హైదరాబాద్, జనవరి 24:
శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా, విజయమిత్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘100 డేస్ లవ్ స్టోరీ’. ‘అతి ప్రేమ భయానకం’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను శుక్రవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా విడుదల చేశారు.... బడ్జెట్ పార్లమెంట్ 28 నుండి, సమావేశాలకు ముందు రోజు అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ జనవరి 24 (ప్రజా మంటలు):
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 27న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సంప్రదాయం ప్రకారం, సమావేశాలు ప్రారంభమయ్యే ముందు అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరపనుంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు రెండు దశలుగా ఏప్రిల్... ఫిబ్రవరి 3 నుంచి ప్రజల కోసం రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్
న్యూఢిల్లీ జనవరి 24, (ప్రజా మంటలు):ఢిల్లీ వాసులు, పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్న ప్రసిద్ధ అమృత్ ఉద్యాన్ (Amrit Udyan) ఫిబ్రవరి 3 నుంచి సాధారణ ప్రజల సందర్శనకు తెరవనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఉద్యాన్ మార్చి 31 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
ప్రతి ఏడాది... గ్రీన్‌ల్యాండ్ సంక్షోభం ప్రభావం డాలర్ కుదేలు… భారత్‌లో ₹1.56 లక్షలకు చేరిన బంగారం ధర
లండన్ / న్యూఢిల్లీ జనవరి 24(ప్రజా మంటలు):
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, యూరోపియన్ దేశాలపై టారిఫ్ హెచ్చరికలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అనిశ్చితిని పెంచాయి.
ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు పరుగులు తీయడంతో బంగారం ధరలు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత అత్యుత్తమ... 