ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు ) :
ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు.
జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలను జగిత్యాల ఆర్టీసీ, రవాణా శాఖ సంయుక్తంగా మంగళవారం జగిత్యాల కొత్త బస్టాండ్ లో డిపో మేనేజర్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించగా డిటిఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా , జగిత్యాల పట్టణ సీ ఐ వేణుగోపాల్, ఎంవిఐ లు రామారావు, అభిలాష్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం, కవిత రెడ్డి, ఆర్టీసీ, రవాణా శాఖ సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డీటీఓ శ్రీనివాస్ మాట్లాడుతు....
- రోడ్డు ప్రమాధాలు ఉగ్రవాధం, భూకంపాల కంటే ప్రమాధమని చెబుతూ ఎక్కువగా వీటివల్లే మరణిస్తున్నారని అన్నారు.
- చిన్న నిర్లక్ష్యం మూలంగా ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని చెబుతూ ప్రయానికుల బాధ్రతే లక్ష్యంగా వాహనాలు నడుపాలని ట్యాక్సీ, ఆటో, కార్లు, ఇతర పెద్ద వాహనాల డ్రైవర్లకు సూచించారు.
- దేశంలో ప్రమాధాలు 2 శాతం జరిగితే మృతులు ఎక్కువగా 11 శాతం ఉంటున్నారని, భద్రత నిజాజీవితంలో ముఖ్యమని పేర్కొన్నారు.
- మైనర్లు డ్రైవింగులో ప్రమాదం జరిగితే 199ఏ ప్రకారం మైనర్ తో పాటు వాహనం రిజిస్ట్రేషన్ దారునికి శిక్ష పడుతుందని శ్రీనివాస్ తెలిపారు.
- 25 నుండి 30 ఏళ్ల యువత దేశానికి చాలా ముఖ్యమని చెబుతూ యువత ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.స్పీడులో ఏమరుపాటు పనికి రాధని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదలను నివారుంచవచ్చన్నారు.
- ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చుతుందని ఆర్టీసీ సంస్థకు మంచి పేరుందని దాన్ని కాపాడుకోవాలని సూచించారు.
జగిత్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. వేణుగోపాల్ మాట్లాడుతూ....
- నిర్లక్ష్యం, దూకుడుతోనే ప్రమాధాలు జరుగుతున్నాయని, తాగి డ్రైవింగ్ చేయారాదని సూచించారు.
- డ్రైవింగ్ లైసెన్స్, అర్సీ బుక్, ఇన్సూరెన్స్ కలిగి ఉంటే ప్రమాదం జరిగితే భీమా వర్తిస్తుందని చెబుతూ
- హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాధాలను అరికట్టావాచ్చన్నారు.
- భారత దేశంలో రోగాల ద్వారా కాకుండా రోడ్డు ప్రమాదలా వల్లనే ఎక్కువగా చనిపోతున్నారని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు.
- జరిమానాలు కడుతున్నారు కానీ ట్రిపుల్ రైడ్, సెల్ ఫోన్ మాట్లాఫుతూ, లైసెన్స్ లేకుండా, రోడ్ సేఫ్టీ పాటించకుండా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని వీటిని పోలీస్ శాఖ ఉపేక్షించదని సీఐ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత మాట్లాడుతూ.....
- రోడ్డు ప్రమాధలు జరుగకుండా, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడుపాలన్నారు.
- మైనర్లకు వెహికిల్స్ ఇవ్వవద్దని పేరెంట్స్ కు ఆమె సూచించారు. హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు.
డిపో మేనేజర్ సునీత కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ
