వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. జనవరి 10న శుక్ర వారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ వేడుకలకై, వైకుంఠ ద్వార దర్శనార్ధం, భక్తులు రానున్నందున దేవాలయాలను, వైకుంఠ ద్వారాన్ని వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమైనారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గ దర్శకత్వంలో, ఆస్థాన వేద పండి తులు బొజ్జా రమేశ్ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
క్షేత్ర ప్రాధాన్యత
అవిభక్త జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు ఉత్తరాన 71 కి.మీ, నూతన జిల్లా కేంద్రమైన జగిత్యాల జిల్లా కేంద్రానికి 27 కి.మీ. దూరాన, శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వర మందిరాలు, మసీదు పక్కపక్కనే కలిగి, చర్చిలూ నిర్మితాలై, వైష్ణవ, శైవ, ముస్లిం, క్రైస్తవ మత సామరస్యానికి ప్రతీకగా, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, పవిత్ర గోదావరి తీరాన ఉంది క్షేత్రరాజం. దక్షిణ భారతావని లోనే అతి పెద్దదైన కోనేరు, అపురూపమైన యమ ధర్మ రాజాలయం, తైమూర్త్య నిలయంగా, వివిధ ఆలయాలు, వైవిధ్యములైన కుండములతో విరాజిల్లుతున్నది సనాతన పుణ్యతీర్థం.
ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు
శ్రీయోగానంద, ఉగ్రనారసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర, శ్రీవేణుగోపాల, యమధర్మరాజ, శ్రీఆంజనేయ ఆలయాలు దేవస్థానం అధీనంలో ఉండగా, సత్యవతి, మహాలక్ష్మి, సంతోషి మాత, గౌతమేశ్వర, శ్రీరామ, దత్తాత్రేయ, మహాలక్ష్మీ, దుర్గ, భక్తాంజనేయ, మార్కండేయ, అక్కపెల్లి రాజేశ్వర, శ్రీసాయి బాలాజీ, అయ్యప్ప, సీతా రామచంద్ర (లక్ష్మీ నరసింహ కాలనీ) ఆలయాలూ, పలు శివ పంచాయతనాలు, బ్రహ్మ పుష్కరిణి, శ్వేతవరాహ తీర్ధం, సత్యవతి, బ్రహ్మ, వశిష్ట, పాల కుండాలు వాటివాటి ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.

"ధనురాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశీ తిథౌ: త్రిం షత్ కోటి సురై: సాకం, బ్రహ్మ వైకుంఠ మాగత:" అసురుల హింసలకు తాళలేని సురులు, తమ కష్టాలను వైకుంఠ నాధునికి విన్నవింప వేడుకోగా, సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్య దినాన వైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహా విష్ణువు దివ్య దర్శనం గావించారు. ఈ నేపథ్యంలో భక్తులు ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో వైకుంఠ ద్వారం నుండి స్వామి వారలను దర్శించు కోవడం ఆనవాయితీ. శుక్రవారం ప్రాత: కాలము (ఉదయాత్ పూర్వం) 2:30 గం.లకు శ్రీలక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకములు, నివేదన వేదమంత్ర పుషములు, అనంతరం ప్రాతఃకాలమున 4.00 గంటలకు వైకుంఠ ద్వారము ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేయించి ముప్పురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చనలు, వివేదనలు, హారతులు, మంత్ర పుష్పం, వేదఘోష, మహదాశీర్వచనములు, 5.00 గం.లకు మంగళ వాయిద్యముల మధ్యన, వేద మంత్రములతో ధర్మపురి శ్రీ మఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరమహంస పరి వ్రాజకాచార్యులు సచ్చితానంద సరస్వతి మహా స్వాముల కరకమలములచే వైకుంఠ ద్వారము తెరిచే కార్యక్రమాలు, 7గంటల నుండి 11వరకు శేషప్ప కళా వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలి, రాజ గోపురములకు, అన్ని ఆలయములకు విద్యుత్ దీపాలంకరణ, పూలదండలతో అలంకరణ చేశారు. స్థానిక పోలీస్ శాఖ వారి సహ కారంతో పోలీస్ బందోబస్తు, అవసరమగు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారాన్ని తెరవ నున్న ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతీ స్వామి, ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, రమణ, భానుప్రసాద్, కవిత, జగిత్యాల ఎమ్మేల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించి ఇప్పటికే ఆహ్వానాలు పలికారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిమ్మీ లాయ్ తీర్పు: హాంకాంగ్ స్వేచ్ఛపై వేసిన తుది ముద్ర
హాంకాంగ్ మీడియా దిగ్గజం, ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన జిమ్మీ లాయ్‌కు కోర్టు దోషిగా తీర్పు ఇవ్వడం ఒక వ్యక్తిపై జరిగిన న్యాయ చర్యగా మాత్రమే చూడటం చరిత్రను చిన్నచూపు చేయడమే. ఇది హాంకాంగ్‌లో భిన్నాభిప్రాయాలకు, స్వతంత్ర మీడియాకు, ప్రజాస్వామ్య రాజకీయాలకు వేసిన చివరి ముద్రగా భావించాల్సిన ఘట్టం.
78 ఏళ్ల జిమ్మీ లాయ్... జగిత్యాల జిల్లాలో మూడవ విడత పోలింగ్ 79.64 శాతం 6 మండలాల్లో ఉత్సాహంగా ఓటింగ్
జగిత్యాల, డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో నిర్వహించిన మూడవ విడత ఎన్నికల పోలింగ్ శాతం 79.64గా నమోదైంది. మొత్తం 1,71,920 ఓట్లకు గానూ 1,36,917 ఓట్లు పోలయ్యాయి.
బుధవారం బుగ్గారం, ధర్మపురి, ఎండపెల్లి, గొల్లపెల్లి, పెగడపెల్లి, వెల్గటూర్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు... జనావాసాల మధ్య మురుగునీరు : పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై కాలనీవాసుల ఆవేదన
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు, 1వ వార్డు సీతారాం నగర్ ప్రాంతంలో జనావాసాల మధ్య డ్రైనేజ్ మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరైన... పద్మారావు నగర్ లో ఫుట్ పాత్ దుకాణాలకు మార్కింగ్
సికింద్రాబాద్ డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ పద్మారావునగర్ పార్కు నుండి సర్దార్ పటేల్ కాలేజ్ వరకు ఉన్న 26 ఫుట్ పాత్ వ్యాపారస్తులకు జిహెచ్ఎంసి అధికారులు బుధవారం మార్కింగ్ వేశారు. ఇకపై తమ పరిధిని దాటి ముందుకు రాకూడదని వారు ఫుట్ పాత్ దుకాణాల నిర్వాహకులను హెచ్చరించారు. వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని... పెన్షనర్స్ భవనంలో అదనపు గది,లిఫ్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 17(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా పెన్షనర్స్ భవన్ లో అదనపు గది మరియు నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను ప్రారంభోత్సవం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం పెన్షనర్స్ డే వేడుకల సందర్భంగా జగిత్యాల పట్టణ ఫంక్షన్ హాల్ లో... మూడవ విడత వివిధ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)
జిల్లాలో 3వ దశ పోలింగ్‌లో భాగంగా ధర్మపురి మండలంలోని జైన, రాజారాం, రాయపట్నం గ్రామాలు, ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలంలోని నంచర్ల, బతికేపల్లి గ్రామాలు, అలాగే వెల్గటూర్ మరియు గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్... ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు.*జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల, గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
జిల్లాలో ఎక్కడా... కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల నేతలు
జగిత్యాల, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలను జగిత్యాల నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి పనులు కావాలంటే అసెంబ్లీలో మాట్లాడటమే కాకుండా ఉన్నతాధికారులు, మంత్రులతో తరచుగా సమావేశమై ప్రతిపాదనలు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయంగా... లోక్ అదాలత్ కు న్యాయవాదులు సహకరించాలి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు.
మెట్టుపల్లి డిసెంబర్ 17 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్టుపల్లి లో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21 రోజున నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో
క్రిమినల్... ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపు దారుణం
సికింద్రాబాద్, డిసెంబర్ 17 (ప్రజామంటలు) :
ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును పీసీసీ వైస్‌ప్రెసిడెంట్, సనత్‌నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. గాంధీజీ ఆలోచనలు, విలువల... అడ్డగుట్టలో అయ్యప్ప స్వామి పడిపూజ
సికింద్రాబాద్, డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ ఇంద్రలక్ష్మీనగర్‌లో కాంగ్రెస్ నాయకుడు గంట రాజు సాగర్ నివాసంలో సాయంత్రం అయ్యప్ప స్వామి పడిపూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శరణుఘోషలతో కాలనీ మారుమోగగా, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కృపకటాక్షాలు ప్రాంత ప్రజలపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పెద్ద... 