శ్రీ మడేలేశ్వర ఆలయంలో గోవుకు కపిలవర్ణ దూడ జననం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద గల శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు గోవు కపిల వర్ణం కలిగిన పెయ్య దూడకు జన్మనిచ్చింది.
కాగా భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకొని గోవు లేగకు జన్మనిచ్చే సమయంలో ప్రదక్షిణాలు చేశారు.
ఈరోజు ఒక పవిత్రమైనటువంటి గోపాష్టమి అంతేకాకుండా కార్తీక మాసము శ్రవణా నక్షత్రము వారముతో సంబంధం లేకుండా కోటి సోమవారం గా పిలుస్తారని భక్తుల విశ్వాసం.
ఈ సందర్భంలో భక్తులు ఆలయానికి చేరుకొని గోమాత కపిల వర్ణం కలిగిన పెయ్య దూడకు జన్మనిస్తున్న సమయంలో ఆ ఘట్టాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు.
గోవు దూడకు జన్మనిచ్చే సమయంలో గో ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణం ,సర్వదేవతలకు ప్రదక్షిణం చేసినట్లుగా అవుతుందని పురాణాలు తెలుపుతున్నాయని ప్రదక్షిణ చేసిన వారికి, చూసిన వారికి గోమాత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల. పార్థసారథి శర్మ, మధుసూదన్ శర్మలు ఆశీస్సులు అందజేశారు. భక్తులు గోమాతకు జై అంటూ నినాదాలు చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనవసరంగా మా పేర్లు లాగుతున్నారు - మాకు సంబంధం లేదు - మంత్రులు పొంగులేటి - ఉత్తమ్ కుమార్
-overlay.jpg-overlay.jpg.jpg)
ఈనెల 18న బీసీ బందుకు అన్ని వర్గాలు సహకరించాలి బీసీ జేఏసీ

కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేస్తారా? తొలగిస్తారా?
-overlay.jpg.jpg)
బీహార్ లో కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్
