శ్రీ మడేలేశ్వర ఆలయంలో గోవుకు కపిలవర్ణ దూడ జననం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద గల శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు గోవు కపిల వర్ణం కలిగిన పెయ్య దూడకు జన్మనిచ్చింది.
కాగా భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకొని గోవు లేగకు జన్మనిచ్చే సమయంలో ప్రదక్షిణాలు చేశారు.
ఈరోజు ఒక పవిత్రమైనటువంటి గోపాష్టమి అంతేకాకుండా కార్తీక మాసము శ్రవణా నక్షత్రము వారముతో సంబంధం లేకుండా కోటి సోమవారం గా పిలుస్తారని భక్తుల విశ్వాసం.
ఈ సందర్భంలో భక్తులు ఆలయానికి చేరుకొని గోమాత కపిల వర్ణం కలిగిన పెయ్య దూడకు జన్మనిస్తున్న సమయంలో ఆ ఘట్టాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు.
గోవు దూడకు జన్మనిచ్చే సమయంలో గో ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణం ,సర్వదేవతలకు ప్రదక్షిణం చేసినట్లుగా అవుతుందని పురాణాలు తెలుపుతున్నాయని ప్రదక్షిణ చేసిన వారికి, చూసిన వారికి గోమాత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల. పార్థసారథి శర్మ, మధుసూదన్ శర్మలు ఆశీస్సులు అందజేశారు. భక్తులు గోమాతకు జై అంటూ నినాదాలు చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
