లైసెన్స్, నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి
లైసెన్స్, నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి
- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
జగిత్యాల అక్టోబర్ 29:
లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని ఎస్పీ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలనీ,దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు దుకాణాలు నిర్వహించేవారు లైసెన్స్ ఉన్నవారు మాత్రమే నిబంధన మేరకే షాపులు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సూచించారు.
ఎలాంటి అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలని అన్నరు. టపాసులను జనావాసాలలో ఎట్టి పరిస్థితుల్లో నిలువ చేయరాదని ఇలా నిలువ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు.
దుకాణాల సమీపంలో ఇసుక, నీరు, ఫైర్ ఎక్స్‌ట్రిమిషన్‌లు ఉంచాలని సూచించారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని పండగను ప్రశాంత వాతావరణoలో జరుపుకోవాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం
