లైసెన్స్, నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి
లైసెన్స్, నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి
- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
జగిత్యాల అక్టోబర్ 29:
లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని ఎస్పీ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలనీ,దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు దుకాణాలు నిర్వహించేవారు లైసెన్స్ ఉన్నవారు మాత్రమే నిబంధన మేరకే షాపులు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సూచించారు.
ఎలాంటి అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలని అన్నరు. టపాసులను జనావాసాలలో ఎట్టి పరిస్థితుల్లో నిలువ చేయరాదని ఇలా నిలువ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు.
దుకాణాల సమీపంలో ఇసుక, నీరు, ఫైర్ ఎక్స్‌ట్రిమిషన్‌లు ఉంచాలని సూచించారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని పండగను ప్రశాంత వాతావరణoలో జరుపుకోవాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన కూల్చివేత పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం:

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి
