రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?
ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా? రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి? కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?
జగిత్యాల రాజకీయాలను ఒక కుదుపు కుడిపిన రాజకీయ హత్య
ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా?
రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి?
కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?
జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి హత్య తరువాత అక్కడ ఏం జరగనున్నది?
రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?
జగిత్యాల రాజకీయాలలో అనూహ్య మార్పులకు నాంది
ఎటూ తేల్చుకోలేని స్థితిలో జీవన రెడ్డి
చాపకింది నీరులా కాంగ్రెస్ లో బిఆర్ఎస్ వ్యవహారం
(సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్)
జగిత్యాల రాజకీయాలలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టనుందని, తలపండిన రాజకీయ నాయకుడు, జగిత్యాల రాజకీయాలలో కురువృద్ధుని లాంటి తాటిపర్తి జీవన్ రెడ్డి జీవితంలో అనుకోని మలుపులకు, మార్పుకు నాంది కానుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత పెద్ద కుదుపును ఆయన 40 ఏళ్ల తరువాత తట్టుకోవాల్సిన పరిసతీలు ఏర్పడ్డాయి.
సామాజిక ఉద్యమాల నేపథ్యంలో, యువ న్యాయవాదిగా ఉంటూ, 1981 లో జరిగిన పంచాయత్ సమితి ఎన్నికల్లో మల్యాల నుండి సమితి అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, రెండేళ్ల లోపే 1982-83 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నుండి గెలిచిన జీవన్ రెడ్డి, అనుకోని పరిస్థితులలో 1984 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అప్పటి నుండి జగిత్యాల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుత జగిత్యాల జిల్లాలో తిరుగులేని నాయకునిగా చలామణి అవుతున్న జీవన రెడ్డికి, ఆయన పైనే రెండుసార్లు గెలిచిన బి ఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వత్తాసు పలకడం, జీవన్ రెడ్డి ఆహాన్ని, ఆధిపత్యాన్ని కూకటివెళ్లతో పేకిలించి వేసిందనే చెప్పవచ్చు.
డిల్లీ వరకు వెళ్ళినా, సీనియర్లు ఎంత మంది చెప్పినా, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కాదనలేక, ఆయనకే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జీవన రెడ్డికి, ఆయన సహచరుడు, ఆత్మీయుడు మార గంగారెడ్డి హత్య, అదీ, మొన్నటి వరకు బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న ఒక యువకుని చేతిలో హత్యకు గురికావడం, ఆయనకు కొలుకొని దెబ్బగా చెప్పుకొంటున్నారు. గంగారెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా, ఆయన కొలుకోలేకపోతున్నారు. విషణ్ణ వదనంతో ఉన్న ఆయనను చూసిన ఎవరికైనా ఆయన ఎంతగా క్రుంగిపోయారో ఇట్టే పసికట్ట వచ్చు.
ఆయన ఎంత ఆవేశంగా ఉన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరిని విమర్శించినా, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కదలిక రావడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఓదార్చడానికి ఫోన్ చేసినా, హైదరాబాద్ లో విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ, జీవన్ రెడ్డి నిన్న మీ పార్టీకొ దండం -- ,నీకో దండం .. పార్టీలో ఉండాలా వద్దా .. అంటూ చేసిన విమర్శలు అన్నీ ఆయన వ్యక్తిగతమని కొట్టి పారేశారు. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపి మధు యాష్కీ లాంటి వారు కొంత సీరియస్ గా తీసుకొన్నా, దానిపై ఎలాంటి రచ్చ చేసే పరిస్థితిలో లేరనే తెలుస్తుంది.
అంతంత మాత్రమే ఆధిక్యంతో శాసన సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగా, మొత్తం పార్టీని తనలో కలుపుకోవాలని చేసిన ప్రయత్నంలో 10 మంది మాత్రమే కాంగ్రెస్ లో చేరడం, అందులో కూడా చేరిన కొందరు కూడా తమకు ప్రాధాన్యత లభించడం లేదని కినుకు వహించి, దూరం - దూరంగా నే ఉంటున్నారు. దీనికి తోడు, బి ఆర్ ఎస్ పార్టీ హైకోర్ట్ వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ వీరి తలపై కత్తిలా వేలాడుతుంది. అందులో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకట రావు ల పేర్లు మాత్రమే ఉన్నా, వారి పట్ల హైకోర్ట్ ఇచ్చే రేపు తెర్పే, మిగతా 7 గురు ఎమ్మెల్యేల కు వర్తిస్తుందని అనుకొంటున్నారు. సంవత్సరంలోగా, ఉప ఎన్నికలకు పోవడానికి ఎవరు కూడా సిద్దంగా లేరు.
ఈ నేపథ్యంలో, జగిత్యాలలోనే కాకుండా, అదే రోజు పఠాన్ చెరువు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులపై కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గడ్డం మహీపాల్ రెడ్డి వర్గీయులు దాడిచేయడం కూడా పార్టీలో కలకలం రేపింది. రాష్ట్ర ప్రజలను ఆకర్షించిన ఉదంతాలు ఈ రెండే అయినా, కొత్తగా పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో పాత -కొత్త కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఉన్న పార్టీలోని వారే కాకుండా కొత్తగా వచ్చిన వారు, మొన్నటి వరకు అధికారం అనుభవించి, కాంగ్రెస్ కార్యకర్తలను అనేక లకు గురి ఇబ్బందులకు గురి చేసిన వారే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ళు నిండిన చేరువులోకి కప్పలు వచ్చినట్లు వచ్చి, ఆధిపత్యం చెలాయించడాన్ని పాత కాంగ్రెసన కార్యకర్తలు భరించలేకపోతున్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో మొదటి నుండి ఒక సామాజిక వర్గానికి జీవన్ రెడ్డి పట్ల సానుకూలత లేదు. దాదాపు 36 సంవత్సరాల తరువాత ఆ వర్గానికి అధికారం వచ్చింది. జీవన రెడ్డి రెండవ సారి ఎమ్మెల్యేగా, వరుసగా రెండవసారి ఓడిపోవడం, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బి ఆర్ ఎస్ పార్టీ ఆధీనలో ఉన్న మున్సిపల్ కూడా కాంగ్రెస్ వశం అవడం కొందరికి కంటిలో నలకలా మారిపోయింది.
మొదటి నుండి అంతా తానే అయి, ఒక్కడే పార్టీని వంటి చేతితో నడిపిన జీవన్ రెడ్డి, కొత్తగా ఎమ్మెల్యే పార్టీలో చేరి ఆధిపత్యం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదు నెలల్లో తన ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగిసిపోనుండగా, మళ్ళీ పోటీ చేయాలనే తపన ఉన్నా, మొన్నటి రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఆయనను ముందుకు పోకుండా చేస్తుంది. తనకంటూ ఒక వర్గం అంటూ లేని ఏకైక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, పెద్దగా ఆర్థిక బలం కూడా లేకపోవడంతో రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని ఒక వర్గం భావిస్తుంది.
ఎన్నడూ రాజకీయ హత్యలు, గొడవలు లేని జగిత్యాల రాజకీయాలలో మొదటిసారిగా మారు గంగారెడ్డి హత్య, నాయకులనే కాకుండా ప్రజలను కూడా ఉలిక్కిపడేట్లు చేసింది. అంతా శ్మశాన వైరాగ్యంలో ఉన్న ఈ పరిస్థితులలో, ఎమ్మెల్యే డా. సంజయ్ ఈ హత్యకు తనకు ఎలాంటి సంభందం లేదని, దీని వెనుక ఉన్నది ఎవరైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నట్లు, అభివృద్ధి కొరకే కాంగ్రెస్ తో నడుస్తున్నాననే ప్రకటన చేయడం కూడా అందరినీ గందరగోళంలో పడేసింది. ఇంతకూ ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది.
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఈ గోడవలను కాంగ్రెస్ నేపథ్యం పట్టించుకో లేక పోవచ్చు. ఆ ఎన్నికల తర్వాత, ఈనెల 24 హైకోర్ట్ ఇచ్చే తీర్పు, ఆదేశాల మేర ఆతరువాతి కార్యక్రమం ఉండవచ్చని, కొత్తగా చేరిన వరైకి ముఖ్యమంత్రి అండ ఉండడం వల్ల సీనియర్లు అయినా వారి మాటకు అంతగా ప్రాధాన్యత లభించక పోవచ్చని, సర్దుకొమ్మని చెప్పి, ఊరడించి పంపే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చని అనుకొంటున్నారు. ఏమైనా, జగిత్యాల నియోజక వర్గంలో ప్రజాబలం ఉన్న నాయకునిగా ఎప్పటికీ నిలిచిపోయే నాయకుడు జీవన్ రెడ్డి. ఈ సంధి కాలంలో జీవన రెడ్డి లాంటి అనుభవం ఉన్న వారు మౌనంగా ఉండక తప్పదేమో. కాలమే ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాజకీయ నాయకురాలిగా ఎదిగిన గాయని మైథిలి ఠాకూర్
తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీకి ఎన్నికైన మైథిలీ ఠాకూర్
పాట్నా నవంబర్ 16:
మైథిలీ ఠాకూర్ , సుప్రసిద్ధ ఫోక్-శాస్త్రీయ గాయికగా పిలువబడే యువ ప్రతిభ. 2000 జూలై 25న బిహార్ మధుబాని జిల్లా బెనిపట్టీలో జన్మించింది. ఆమె సంగీత ప్రస్థానం చిన్న వయసులో ప్రారంభమైంది — తండ్రి రమేష్ ఠాకూర్ వలన ఆమె బాల్యానికి సంగీత... రాజ్‌కోట్‌లో భారత్-A బౌలర్లు నిప్పులు: SA-A 132 రన్లకే ఆలౌట్
రాజ్‌కోట్, నవంబర్ 16:
రాజ్‌కోట్‌లోని నిరంజన్ స్టేడియంలో జరిగిన India A vs South Africa A రెండవ అనధికార ODIలో భారత A జట్టు బౌలర్లు బిజీగా ఉన్నారు. టాస్ గెలిచిన SA-A జట్టు బ్యాటింగ్ తీసుకున్నప్పటికే వ్యాప్తి వచ్చింది — భారత బౌలర్లు ధాటికి SA-A 30.3 ఓవర్లు వేసినప్పుడు కేవలం ... నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయ–ఆర్థిక ఏటీఎంగా మారింది: జీవన్ రెడ్డి
నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయంగా, ఆర్థికంగా ఏటీఎంగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారుల ఓటు చోరీ కుట్రపై చర్యలు చేపట్టాలని డిమాండ్. జర్నలిస్టుల ఐక్యతపై డబ్ల్యూజేఐ దృష్టి –కరీంనగర్ జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నిక
కరీంనగర్, నవంబర్ 16 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన... 2026 హార్లీ-డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ 883 జనవరిలో లాంచ్ – కొత్త ఫీచర్లతో అదిరిపోయే క్రూజర్
న్యూయార్క్ నవంబర్ 16:
ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 Harley-Davidson Sportster 883 చివరకు జనవరి 2026లో అధికారికంగా లాంచ్ కానుంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, రైడింగ్ కంఫర్ట్—మొత్తంగా హార్లీ బ్రాండ్‌కి తగ్గట్టే ఈ మోడల్ అందరినీ ఆకట్టుకోనుంది.
హార్లీ-డేవిడ్సన్లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో స్పోర్ట్‌స్టర్ 883 ఒకటి. తాజా... కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత
టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు);
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు... శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు ప్రారంభం
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముజగిత్యాల లో ఘనంగా ప్రారంభమైన శ్రీ ధన్వంతరి జయంతోత్సవము మరియు శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవము
మొదటి రోజునవంబర్ 16 ఆదివారం (భానువాసరే కార్తీక మాసం శుక్ల పక్షం ద్వాదశి ఉ.గం. 5.15 ని.ల... సన్మార్గంలో నడిపించే శక్తి.. సంగీత, సాహిత్యాల సొంతం తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సంగీతం సాహిత్యాల సొంతమని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరి నారాయణ దాసు ఆశ్రమం ఆవరణలో సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ కలం స్నేహం అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో... స్పెషల్ లోక్–అదాలత్‌లో 1861 కేసుల్లో రాజీ :జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)స్పెషల్ లోక్–అదాలత్ ద్వారా సైబర్ మోసాల్లో కోల్పోయిన రూ.20 లక్షల మొత్తం బాధితులకు రీఫండ్
ఈనెల 15 వరకు స్పెషల్ లోక్-అదాలత్ లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న
జిల్లాలో... యూపీలో రాతి క్వారీ కూలిన ఘటన ఒకరి మృతి, మరికొందరు శిథిలాల కింది
సోన్‌భద్రా (ఉత్తరప్రదేశ్), నవంబర్ 16:
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రా జిల్లా బిల్లీ–మార్కుండి ప్రాంతంలోని కృష్ణ మైనింగ్ వర్క్స్ స్టోన్ క్వారీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల క్రింద చిక్కుకున్నారు. ఇప్పటివరకు ఒక కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసినట్లు అధికారులు నిర్ధారించారు.
ఘటన ఎలా జరిగింది?
సాక్షులు... బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్
న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
మాజీ మంత్రి ఆర్.కే సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు.
రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ... బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి NDA భారీ ఏర్పాట్లు — నవంబర్ 19 లేదా 20న కార్యక్రమం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA 202 సీట్లు గెలుచుకున్న తర్వాత, నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేడుకను నవంబర్ 19 లేదా 20న ఘనంగా నిర్వహించేందుకు NDA సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి మోదీ హాజరుకానున్నారు. 