మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం?? - దావ వసంత సురేష్.
మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం? - దావ వసంత సురేష్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 19 అక్టోబర్ (ప్రజా మంటలు) :
రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బిఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్...
ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ...
సాధారణ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 10000 ఇస్తున్నారని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 15000ఇస్తామని చెప్పారని ఇంకా ఇవ్వడం లేదని రైతు భరోసా ఉన్నట్టా..లేనట్టా ?? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు భరోసా వేసంగి పంటకు ఇస్తామని పేర్కొనడం విడ్డురంగా ఉందని..
.... రైతు భరోసా కు చీకటి రోజు....
గడిచిన వాన కాలం పంట కోతలకు వచ్చిన రైతు భరోసా ఇవ్వలేక పోయారని..రుణమాఫీ ఆగష్టు 15లోపల చేస్తామని,సీఎం 40లక్షల కోట్లు మాఫీ చేశామని, వ్యవసాయ శాఖమంత్రి, ఇతర మంత్రులు ఒకరి మాటకు ఒకరికి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని...కేసీఆర్ రుణమాఫీ,నాట్లు వేయడానికి ముందు రైతు బంధు,రైతు మరణిస్తే 5లక్షల రైతు బీమా, సకాలంలో ఎరువులు అందజేశారని..కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో సంబంధిత మంత్రులతో, ఎమ్మెల్యే,కలెక్టర్ల తో సమీక్షా సమావేశము ఏర్పాటు చేసి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు,గన్ని బ్యాగ్ లు అందుబాటులో ఉంచడం జరిగిందని...
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నడ్డి విరిచే ప్రభుత్వం....
రైతుల నోట్లో మట్టి కొడుతుందని స్కామ్ ప్రభుత్వం..
ఢిల్లీకి మూటలు పంపే ప్రభుత్వం..6గ్యారంటీల అమలు లో విఫలం
కళ్యాణలక్ష్మి కి అదనంగా తులం బంగారం, మహాలక్ష్మి 2500 పింఛన్ ఏమైందని ఏద్దేవా చేశారు.
ఈ సందర్భంగా దావ వసంతసురేష్ మాట్లాడుతూ....
ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు చావు కబురు చల్లగా చెప్పిండు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఓట్లను ఎన్నికల సమయంలో వాడుకొని ఏర్పడ్డది ఈ నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి,కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేవా?
బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో మేమందరం రైతులందరికీ రైతుభరోసా వచ్చేంతవరకు రైతుల పక్షాన పోరాడుతాం.
రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చారు తప్ప ఎక్కడా మార్పు రాలేదన్నారు.
అమలు గాని హామీలతో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క వర్గానికి హామీల అమలు కాలేదన్నారు
కెసిఆర్ గారిని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇవ్వాల రైతన్ననే కాలదన్నె గడ్డు పరిస్థితి ఎవరి ద్వారా వచ్చిందో ఒకసారి రైతులందరు గమనించు కోవాలన్నారు.
రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి అని పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రతి గ్రామంలో నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు
పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ పాలనలో జగిత్యాల జిల్లాగా ఏర్పడి మెడికల్ కాలేజీ స్థాపన అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రథమ స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది అంటే కెసిఆర్ గారి వల్లే సాధ్యమైందన్నారు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, బిఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం,ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు,మజాహిర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)పండుగలు, ఎన్నికలు, జాతరలు ప్రశాంతంగా – అవాంఛనీయ సంఘటన లేకుండా ముగిసిన ఏడాది*
*మహిళలు, చిన్నారుల భద్రతే ప్రథమ లక్ష్యం,– డ్రగ్స్ పై జీరో టాలరెన్స్ విధానం అమలు*
*‘సురక్షిత ప్రయాణం’తో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు
జిల్లాలో గత సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ... యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న
జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో... పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)
పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామశాల (జిమ్)ను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. పోలీస్ సిబ్బంది రోజువారీ... పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 23( ప్రజా మంటలు దగ్గుల అశోక్)
ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని పుష్కర ఘాట్ల అభివృద్ధి కొరకు కావలసిన పనులను పర్యవేక్షించిన గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, జగిత్యాల మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ హైదరాబాద్ వారి కార్యాలయ అధికారులు మరియు ఇబ్రహీంపట్నం తాసిల్దార్, ఎంపీడీవో ఇతర మండల అధికారులు.... మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌పై ACB సోదాలు
మహబూబ్‌నగర్, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (Dy Commissioner) రవాణా శాఖాధికారి కిషన్ నాయక్ పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అధికార ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఈ దాడులు చేపట్టినట్లు... కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్
కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో డాక్టర్ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సాయికుమార్ నేడు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జువ్వాడి నర్సింగరావు గారు “డాక్టర్ సాయికుమార్... ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు
అమరావతి డిసెంబర్ 23(ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టి పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఉద్యోగుల నివాసాలను తనిఖీ చేశారు.
విజయనగరం జిల్లా భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణతో పాటు ఆయన సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్... కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ
కోచి, కేరళ డిసెంబర్ 23 (ప్రత్యేక కథనం):
కోచిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అనంతరం ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తికి ఓ డాక్టర్ చేసిన అత్యవసర చికిత్స అక్షరాలా ప్రాణాలను నిలిపింది. శ్వాస తీసుకోలేక తంటాలు పడుతూ, మరణం అంచున ఉన్న ఆ వ్యక్తికి డాక్టర్ రోడ్డుపైనే తక్షణ శస్త్రచికిత్స చేసి... న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు
న్యూ ఢిల్లీ డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, మానవ హక్కుల అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పలు సంఘాలు హైకమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి.
నిరసనకారులు పెద్ద ఎత్తున... జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత
హైదరాబాద్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనంబాట కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో, నారపల్లి వద్ద కవిత గారికి అభివాదం చేసేందుకు ప్రయత్నించిన తండ్రీకుమార్తె బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు.
ఈ ఘటనను గమనించిన కవిత గారు వెంటనే తన వాహనాన్ని ఆపి, వారిని తన కాన్వాయ్‌లోని వాహనంలో... బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం
బీర్పూర్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు)ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
సోమవారం విజయం సాధించిన గ్రామపంచాయతీ సర్పంచ్‌లు ఉప సర్పంచ్ లు... 