ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ
ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు
ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు మార్గదర్శకాలు జారీ
హైదారాబాద్ అక్టోబర్ 11 :
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉత్తర్వుల ప్రతులను చేసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి.చిన్నారెడ్డి విడుదల చేశారు.
హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన 'ప్రవాసీ ప్రజావాణి' ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో నెం.205 కు కొనసాగింపుగా సాధారణ పరిపాలన శాఖ లోని ప్రవాస భారతీయుల (జీఏడి - ఎన్నారై) విభాగం పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈనెల 9న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) మార్గదర్శకాల మెమో జారీ చేశారు. 'ప్రవాసీ ప్రజావాణి' లో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగతంగా ప్రామాణికరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
'ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణ మార్గదర్శకాల ఉత్తర్వుల ప్రతులను శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి విడుదల చేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, దుబాయి లోని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నర్సింలు, స్వచ్ఛంద సేవకులు శాంతిప్రియ యాదవ్ (మలేసియా), బషీర్ అహ్మద్ (ఓమాన్ రిటనీ) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ప్రవాసీ ప్రజావాణి' నిర్వహణకు చక్కటి ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ కు వారు కృతఙ్ఞతలు తెలిపారు.
*'ప్రవాసీ ప్రజావాణి' మార్గదర్శకాలు*
గల్ఫ్, ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన 'ప్రవాసీ ప్రజావాణి' ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో విదేశాల్లో ఉన్న బాధితుల పక్షాన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయవచ్చు. తదుపరి చర్యల కోసం ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తారు.
*జీఏడి - ఎన్నారై విభాగం పరిధిలో:*
గల్ఫ్ తదితర దేశాల నుంచి మృతదేహాలను ఇండియాకు తెప్పించడం, విదేశాల నుంచి వచ్చిన శవపేటికలను హైదరాబాద్ విమానాశ్రయం నుంచి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం (దారిద్ర రేఖకు దిగువన - బీపీఎల్ వారికి), పేషేంట్లను స్వదేశానికి రవాణా చేయడం, విదేశీ జైళ్లలో ఉన్నవారికి న్యాయ సహాయం చేసి విడుదలకు కృషి చేయడం, వీసా గడువును మించి (ఓవర్ స్టే) అక్కడే నివసించడం, అత్యవసర పరిస్థితులు, క్షమాభిక్ష (ఆమ్నెస్టీ), జీతం బకాయిలు ఇప్పించడం, విదేశాలలో మన వారికి అవసరమైన అన్నిసేవలను జీఏడి - ఎన్నారై విభాగం నేరుగా పర్యవేక్షిస్తుంది. విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలు, ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానము చేస్తుంది. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి.
*ఎన్నారై మహిళా పోలీస్ విభాగం పరిధిలో:*
విదేశాల్లోని ఎన్నారై కుటుంబ వివాదాల పరిష్కారం గురించి వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం హైదరాబాద్ లక్డీకాపూల్ లోని పోలీస్ కార్యాలయంలోని ఎన్నారై విమెన్ సెల్ కు పంపిస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్, పోలీస్ ఎఫ్ఐఆర్, విదేశంలోని వివరాలు, తెలంగాణలోని కుటుంబ వివరాలు మొబైల్ నెంబర్లు సమకూర్చాలి.
*ఏజెంట్ల మోసాలు - పోలీస్ శాఖ పరిధిలో:*
నకిలీ ఏజెంట్లు, చీటింగ్ కేసులు, విదేశాలకు సంబంధించిన ఇతర సారూప్య సమస్యలపై తదుపరి చర్యల కోసం సంబంధిత కమీషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కు బదిలీ చేస్తారు. ఈ సేవలు వినియోగించుకోవడానికి తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ తదితర వివరాలు అందజేయాలి.
*గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా*
రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) కోసం గల్ఫ్ దేశాలలో చనిపోయిన వ్యక్తి జీవిత భాగస్వామి (భార్య / భర్త), పిల్లలు, తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విజ్ఞప్తిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తారు. నేరుగా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవడం మంచిది. తెల్లకాగితంపై అభ్యర్థన లేఖ, పాస్ పోర్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి.
*గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు:*
గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలలో అడ్మిషన్ల కొరకు వచ్చిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం విద్యా శాఖకు బదిలీ చేస్తారు. తెల్ల కాగితంపై దరఖాస్తు, పాస్ పోర్ట్ మొదటి పేజీ అడ్రస్ పేజీ, ఆధార్ కార్డు, విద్యార్థి సర్టిఫికెట్లు సమర్పించాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
గోర్ బంజారా సమాజానికి చెందిన రెండు వందల ఏళ్ల జనజీవన సంఘర్షణ, చరిత్రను తొలిసారిగా నవలరూపంలో తీసుకురావడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్ రచించిన తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక... పట్టణ సంస్థల బలోపేతం, ఎమ్మెల్యేల ఆరోగ్య పథకంపై కీలక చర్చలు : సచివాలయంలో రాజేశం గౌడ్ భేటీలు
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ సచివాలయంలో వరుసగా కీలక భేటీలు నిర్వహించారు. పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం, శాసనసభ్యుల ఆరోగ్య పథకం అమలు అంశాలపై ఆయన ఉన్నతాధికారులు, మంత్రులతో సవివరంగా చర్చించారు.
మొదటిగా పురపాలక పరిపాలనా శాఖ... ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం సాగుపై సమీక్ష పాల్గొన్న జిల్లా కలెక్టర్
జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు) జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ, లోహియ ఆయిల్ పామ్ కంపనీ, మైక్రో ఇరిగేషన్ సిబ్బందికి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణము పెరుగుదల కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఫిబ్రవరి మాసం వరకు వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశాలు జారీచేయడం
ఈ... జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్
జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు) దావ వసంత సురేష్ శనివారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ బిఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు దావ వసంత సురేష్ మాట్లాడుతూ....మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజెంగి నందయ్య... ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
బోయిన్పల్లి మనోవికాస్ నగర్లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని... పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్
జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పార్టీ మారలేదని చెబుతున్నట్లయితే, రేపు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సవాల్ విసిరారు.
మంత్రి అడ్డూరి లక్ష్మణ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్యలు... నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు
మక్తల్ డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
నలభై సంవత్సరాలుగా గ్రామస్తుల విశ్వాసాన్ని సొంతం చేసుకున్న వనజమ్మ కుటుంబానికే ఆ గ్రామ సర్పంచ్ పదవిని కట్టబెట్టడం విశేషం. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి వరకు ఈ కుటుంబ సభ్యులే బాధ్యతలు చేపట్టుతూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
ఐక్యతతో ముందుకు... పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి. -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
అనంతరం 2024... హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్
కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు):
కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి... అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన... 