కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం -మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్
కొండా సురేఖ వ్యాఖ్యలు ఆడ జన్మకే కలంకం -మహిళా మంత్రులను అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ పై సిఎం రేవంత్ రెడ్డి దాడి
-మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్
జగిత్యాల అక్టోబర్ 03:
ఎంగిలి పూల బతుకమ్మ నాడు ఎంగిలి మాటలు మాట్లాడిన కొండా సురేఖ బేషరతుగా కేటీఆర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్ డిమాండ్ చేశారు.
పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాతో మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండా సురేఖ క్యాలి తప్పి మాట్లాడుతున్నారని, కొండా వ్యాఖ్యలపై మాట్లాడాలంటే అసహ్యం వేస్తుందని.రాజకీయాల్లో ఇలాంటి మహిళలు ఉన్నారంటే బాధగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ పాలన వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే మహిళా మంత్రులను శిఖండి లాగా పెట్టుకుని రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు.
రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ సంస్కారహీనంగా,సినిమా పరిశ్రమను కించపరిచేలా, కేటీఆర్ ని ఉద్దేశించి మంత్రి బజారు భాషాపై వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నాం...
మీ హాయాంలో N కన్వెన్షన్ కూలగొట్టారు మరి మీరు ఎవరిని పంపమని డిమాండ్ చేశారు.? పంపలేదు గనుకనే కూల్చివేశారా? అని మేము విమర్శించవచ్చు..కానీ మాకు ఒక సభ్యత సంస్కారం ఉంది..మహిళలను గౌరవించే ఒక విధానం మాది.అందుకే అలాంటి అసభ్యకరమైన విమర్శలు చేయమని అన్నారు.
హైడ్రా పేరుతో సిఎం రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను కూలుస్తున్నారని,ప్రజలంతా బిఆర్ఎస్ వద్దకు వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారని, ఈ క్రమంలో బిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ ఓర్వలేక కేటీఆర్ పై సురేఖ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు
రాజకీయంగా ఎదురుకోలేకనే ఇటువంటి నీచ సంస్కృతికి దిగజారుతున్నారని, అరాచకాలు,అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ పార్టీ పేరు గాంచిందన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఒక కాంగ్రెస్ మహిళ కమిషన్ గానే కాకుండా మహిళల పక్షాన ఉండి వెంటనే కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటల పై యాక్షన్ తీసుకోవాలన్నారు
కేటీఆర్ కి క్షమాపణ చెప్పకుంటే ఉర్కునేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల రాయికల్ AMC మాజీ చైర్మన్లు శీలం ప్రియాంక ప్రవీణ్,ఉదయ శ్రీ, రాయికల్ మండల మహిళా అధ్యక్షురాలు స్పందన తదితరులు ఉన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
