లంచం ఇవ్వకండి, మాకు సమాచారం ఇవ్వండి - ఈ. సాలియా నాయక్, ఎస్ ఈ, జగిత్యాల - టిజి ఎన్ పి డిసిఎల్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 08 సెప్టెంబర్ (ప్రజా మంటలు) :
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి ఉన్నదని , సేవలు అందించే క్రమంలో సంస్థ సిబ్బంది వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని యాజమాన్యం తేల్చిచెప్పింది .
సంస్థలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామని, TGNPDCL సంస్థకు సంబంధించిన సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సేవలకు ప్రతిఫలంగా లంచం అడిగితే, విజిలెన్స్ వింగ్ ఆధ్వర్యంలో పర్యవేక్షించబడుతున్న ఈ నంబరుకు 9281033233, అలాగే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయగలరని తెలిపారు.
సంస్థ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు ఉత్తమమైన సేవలలో భాగంగా కాల పరిమితికి(సిటిజన్ చార్టర్) లోబడి సేవలు అందించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి "ఎన్పీడీసీఎల్ గ్రీవీయన్స్ పోర్టల్ "పెట్టడం జరిగిందని ఇందులో సమస్యలను పరిష్కరించుకోవచ్చని వివరించారు.
లంచం ఇవ్వకండి మాకు సమాచారం ఇవ్వండి అని 16 సర్కిళ్ల పరిధిలో అన్ని కార్యాలయాల్లో, సబ్ స్టేషన్ లలో పోస్టర్లను ఇదివరకే పెట్టడం జరిగిందని చెప్పారు. ఎవరైనా లంచం అడిగిన అందులో పొందు పరచబడిన నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు .
అవినీతి రహిత సమాజము లో భాగంగా విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్ధం ఈ పోస్టర్లను అతికించడం జరిగిందని అన్నారు .
సంస్థ పరిధిలో అవినీతి రహిత వాతావరణం కల్పించడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి యాజమాన్యం నిబద్ధతతో పనిచేస్తున్నదని , వినియోగదారులకు సేవల విషయంలో ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని యాజమాన్యం తెలిపింది .
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్‌ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
