జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.
జో వాదా కియా వో నిభాన పడేగా - ప్రజా సంఘాల సంఘీభావమే జర్నలిస్టుల ఉద్యమానికి స్ఫూర్తి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 18 ఆగస్టు (ప్రజా మంటలు) :
సమాజంలో ఎవరికి సమస్య వచ్చిన జర్నలిస్టులు మాత్రమే ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల కొనసాగే జర్నలిస్టుకు సమస్య వస్తే ఎవరు తీరుస్తారు అన్న డాలర్ల ప్రశ్నకు ప్రతిరూపమే దీక్షలు తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధికి తమ దీక్షలు వ్యతిరేకం కాదని కేవలము కొద్దిపాటి మిగిలిన ప్రభుత్వ భూమి తమకు ఎక్కడ అందకుండా పోతుందో అన్న భావనతో దీక్షలకు దిగామని మొదట్నుండి జర్నలిస్టులు అంటున్న మాటలే .
మొదట్లో జర్నలిస్టుల సమస్యను అందరు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా తీసుకోలేదు. ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారి సంఘీభావంతో జర్నలిస్టుల దీక్షలు పూర్తిస్థాయిలో న్యాయబద్ధమైనవే అనే భావన ఏర్పడి ఎట్టకేలకు సమస్య పరిష్కరించి జర్నలిస్టులను ఓ ఇంటి వారిని చేయాలన్న కలను తీర్చే దిశగా స్థానిక శాసనసభ్యులు డా సంజయ్ కుమార్, చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమన్వయంతో సమస్య పరిష్కార దిశగా అడుగులు వేసి ఎట్టకేలకు దీక్షలను విరమింప చేశారు.
ఉద్యమాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయని దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమమేనని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న జర్నలిస్టులకు తెలియంది కాదు.
అందుకే ప్రజాప్రతినిధులపై పూర్తి భరోసాతో దీక్షను విరమించారు.
నేటికీ జర్నలిస్టులు జగిత్యాల రోడ్డు మీదికి వచ్చి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఉద్యమం 15 రోజులు కొనసాగింది . వారిపై కనీస కనికరం లేదా ??? ఇంకా ఎన్ని రోజులు రోడ్ల పై ఉంటే వారికి పిడికెడు భూమి అందుతుంది ???
ఇప్పటివరకు జర్నలిస్టుల సంక్షేమం వచ్చేసరికి గత బారాస పార్టీ, నేటి కాంగ్రెస్ పార్టీ ఏమి తీసిపోయేలా లేవు !!! అని పలువురు విపక్ష నేత లు, పలువురు జర్నలిస్టులు అనుకున్నప్పటికీ
ఏది ఏమైనప్పటికి జగిత్యాల ప్రాంత రాజకీయ నాయకులే జర్నలిస్టులకు అండదండ కానీ
*జమీన్ కొరకు జిద్ద్ చేస్తేనే జీతెంగా క్యా ???* అన్నట్లుగా మాత్రం ఉండరాదు వారి దోస్తీ... సానుకూల స్పందనతో లక్ష్యం నెరవేరుతుందని ఆశ జర్నలిస్టులలో గుడిసెలో గుడ్డిదీపంలా మిణుకు మిణుకు మంటుంది .
*4th ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులకు కావాల్సింది ఎస్టేట్ లు కాదు. వాళ్ళ ఊరిలో అనుకూలమైన కొన్ని సెంట్ల స్థలం.*
కైండ్ హార్టెడ్ కమిటెడ్ రెస్పాన్స్‌బుల్ లీడర్ ఎవరైనా ఉన్నారా ??? అని జర్నలిస్టు సమాజం మూగ మనసుతో ప్రశ్నిస్తుంది!!! అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.
దయచేసి శ్రమ యొక్క విలువను రోడ్డున నిలబెట్టకండి అని వేడుకున్న జర్నలిస్టుల మాటలు ఈసారి వృధా కాలేదు.
హితుడా, జర్నలిస్టు మిత్రుడా నేటి పరిస్థితులకు మన అలిశెట్టి ప్రభాకరన్న మాటలు :
శిల్పం చెక్కకముందు బండ
శిక్షణ పొందకముందు మొండి
ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస
సో.......
కాలానికి వదలకు భరోసా !!!! మాటలను
స్ఫూర్తిగా నింపుకుని మనము మన డిమాండ్లు నెరవేరే వరకు పోరాడుదాం.అనుకొని మొత్తం మీద 15 రోజులపాటు వివిధ రూపాల్లో తమ ఉద్యమాన్ని కొనసాగించారు.
ఈసారి మాత్రం ఉవ్వెత్తున లేచి పడిన ఉద్యమ కెరటానికి ప్రజా సంఘాలు ,వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార, వాణిజ్య వేత్తలు, విద్యాలయాల యాజమాన్యాలు, వ్యక్తులు ఒక్కరేమిటి ప్రతి ఒక్కరు జర్నలిస్టుల న్యాయబద్ధ మైన ఇండ్ల స్థలాల దీక్షలకు మద్దతు తెలపడం కొసమెరుపే కాదు.
కొంతవరకు జర్నలిస్టులలో నైతిక ధైర్యం పెంచడానికి, ఉద్యమస్ఫూర్తిని కొనసాగించడానికి దోహదపడిందని చెప్పక తప్పదు.
ఇది కేవలం స్థానిక ప్రజాప్రతినిధులకే పరిమితం కాక రాష్ట్రస్థాయిలో క్యాబినెట్ స్థాయి సంబంధిత మంత్రితో పాటు అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతు రావడం పట్ల జర్నలిస్టులు తమకల నెరవేరుతుందని గట్టి నమ్మకంతో పాటు స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ అడ్లూరి, శాసనమండలి సభ్యులు ,ఐజేయు జర్నలిస్టుల నాయకుల తదితరుల సమక్షంలో నిమ్మరసం స్వీకరించడం ఒక గొప్ప ప్రయత్నానికి నాంది అని చెప్పక తప్పదు.
అంతేకాకుండా దశాబ్దాల కాలంగా ఉన్న జర్నలిస్టుల కల నెరవేరుతుందని నమ్మకం సైతం కల్పించగలిగింది.
ఈ మైత్రి పర్వం లో
ప్రస్తుత అధికార హస్తం పార్టీ జగిత్యాల జర్నలిస్టులపై చేయూత హస్తం గా ఉంటుందని ఆశిద్దాం మూడు దశాబ్దాల చిరకాల వాంఛ నెరవేరుతుందని ఎదురుచూపులు నిజం కానున్నాయని ఆశావహ దృక్పథంతో జర్నలిస్టులు చూడాల్సిందే...
జో వాదా కియా వో నిభానా పడేగా !!!
More News...
<%- node_title %>
<%- node_title %>
కలెక్టరేట్లో 'నషా ముక్త్ భారత్ ' అభియాన్ ప్రతిజ్ఞ డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడలి –జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) బి. రాజ గౌడ్
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా అధికారులు ,కలెక్టరేట్ సిబ్బంది , విద్యార్థులచే మాదక ద్రవ్య నిరోధక ప్రతిజ్ఞ
డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ పేర్కొన్నారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశమందిరంలో... అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయము లో ఘనంగా శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మంగళ వారం కార్తీక మాసం శుక్ల పక్షం త్రయోదశి ఉ. సుప్రభాత సేవ మరియు మూలవిరాట్టుకు అభిషేకములు నిర్వహించారు. భక్తులు... ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సత్ఫలితాలిస్తున్న అవగాహన కార్యక్రమాలు- మూఢ విశ్వాసాల పై ప్రజలలో కనిపిస్తున్న మార్పు
జగిత్యాల జిల్లా ప్రజల్లో సామాజిక అంశాల పై చైతన్యం పెంపొందించేందుకు పోలీసులు నిరంతరం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, తెలిపారు.
2016 నుoడి జగిత్యాల పోలీస్ కళా బృందం జిల్లా వ్యాప్తంగా... మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లీ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి. హిడ్మా భార్య, కీలక నాయకులు, PLGA సభ్యుల మరణం. AP ఇంటెలిజెన్స్ ధృవీకరణతో పూర్తి వివరాలు. హరిహరాలయంలో కార్తీక సోమవారం ఘనంగా పరమ శివునికి అభిషేకాలు
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకొని పరమ శివునికి పంచామృతాలతో అభిషేకించి కార్తీకదీపంలు వెలిగించారు.
ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ అధ్యక్షులు చాకుంట వేణుమాధవ రావు దంపతులు సాంబశివునికి వివిధ... ఖమ్మం జిల్లా లో–జాగృతి జనంబాట పర్యటనలో మాడల్ స్కూల్ ను సందర్శించిన కవిత
ఖమ్మం నవంబర్ 18 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు సందర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
స్కూల్ హాస్టల్ భవనంలో పెచ్చులూడిన గోడలు, పైకప్పు ఊడిపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితి నెలకొన్నట్లు... హైదరాబాద్లో బంగారం–వెండి ధరల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజా మంటలు):హైదరాబాద్లో బంగారం మరియు వెండి ధరలు ఈరోజు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఊగిసలాట, రూపాయి మార్పిడి విలువ, స్థానిక డిమాండ్ వంటి అంశాలు నగర రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. ధరలను స్థానిక వ్యాపారులతో మాట్లాడి సరిపోల్చుకోండి. ఇవి సమాచారం కొరకు మాత్రమే. వాస్తవ... ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ను కలిసిన కొత్త రూరల్ ఎస్ఐ
జగిత్యాల (రూరల్), నవంబర్ 18 (ప్రజా మంటలు):జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్ నూతన ఉపనిర్వాహక అధికారి (SI)గా ఉమా సాగర్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, సన్మాన సూచికగా మొక్కను అందజేశారు.
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమా సాగర్,... బేగంపేట్లో రోడ్డు ప్రమాదం: థార్ వాహనం నుజ్జునుజ్జు, ట్రక్ బోల్తా
బేగంపేట్ బస్ స్టాప్ వద్ద థార్ వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టిన హెవీ లోడ్ ట్రక్ బోల్తా. గాయపడిన వారు ఆసుపత్రికి తరలింపు. పోలీసులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వికటించిన ఐవీఎఫ్ చికిత్స… శంషాబాద్లో భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య
శంషాబాద్లో ఐవీఎఫ్ చికిత్స వికటించడంతో ఎనిమిదో నెల గర్భిణి శ్రావ్య, గర్భంలోని కవలలు మృతి. షాక్ తట్టుకోలేక భర్త విజయ్ ఆత్మహత్య. కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసిన హృదయ విదారక ఘటన పూర్తి వివరాలు. ఐ–బొమ్మ పైరసీ వెబ్సైట్ లో సంచలన ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):
ఇన్నాళ్లు పోలీసులను చాలెంజ్ చేసిన ibomma సంచలన ప్రకటనను తన వెబ్సైట్ లో పోస్ట్ చేసింది.
ఐ–బొమ్మ తన ప్రకటనలో, “ఈ మధ్యలో మీరు మా గురించి విన్నే ఉంటారు… మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్నారు… కానీ ఇప్పుడు మా సేవలను నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా... ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాగృతి జనంబాటలో భాగంగా కవిత పర్యటన. మోడల్ స్కూల్ సమస్యలు, సీతారామ ఎత్తిపోతల పథకం ఆలస్యం, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, వైరా మార్కెట్ సమస్యలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు. సమగ్ర కథనం 