జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.

జో వాదా కియా వో నిభాన పడేగా - ప్రజా సంఘాల సంఘీభావమే జర్నలిస్టుల ఉద్యమానికి స్ఫూర్తి.

On
జగిత్యాల జర్నలిస్టుల జైత్రయాత్ర.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 18 ఆగస్టు (ప్రజా మంటలు) : 

సమాజంలో ఎవరికి సమస్య వచ్చిన జర్నలిస్టులు మాత్రమే ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిల కొనసాగే జర్నలిస్టుకు సమస్య వస్తే ఎవరు తీరుస్తారు అన్న డాలర్ల ప్రశ్నకు ప్రతిరూపమే దీక్షలు తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధికి తమ దీక్షలు వ్యతిరేకం కాదని కేవలము కొద్దిపాటి మిగిలిన ప్రభుత్వ భూమి తమకు ఎక్కడ అందకుండా పోతుందో అన్న భావనతో దీక్షలకు దిగామని మొదట్నుండి జర్నలిస్టులు అంటున్న మాటలే .

మొదట్లో జర్నలిస్టుల సమస్యను అందరు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా తీసుకోలేదు. ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారి సంఘీభావంతో జర్నలిస్టుల దీక్షలు పూర్తిస్థాయిలో న్యాయబద్ధమైనవే అనే భావన ఏర్పడి ఎట్టకేలకు సమస్య పరిష్కరించి జర్నలిస్టులను ఓ ఇంటి వారిని చేయాలన్న కలను తీర్చే దిశగా స్థానిక శాసనసభ్యులు డా సంజయ్ కుమార్, చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమన్వయంతో సమస్య పరిష్కార దిశగా అడుగులు వేసి ఎట్టకేలకు దీక్షలను విరమింప చేశారు.

ఉద్యమాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయని దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమమేనని తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న జర్నలిస్టులకు తెలియంది కాదు.

అందుకే ప్రజాప్రతినిధులపై పూర్తి భరోసాతో దీక్షను విరమించారు.

నేటికీ జర్నలిస్టులు జగిత్యాల రోడ్డు మీదికి వచ్చి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఉద్యమం 15 రోజులు కొనసాగింది . వారిపై కనీస కనికరం లేదా ??? ఇంకా ఎన్ని రోజులు రోడ్ల పై ఉంటే వారికి పిడికెడు భూమి అందుతుంది ??? 

ఇప్పటివరకు జర్నలిస్టుల సంక్షేమం వచ్చేసరికి గత బారాస పార్టీ, నేటి కాంగ్రెస్ పార్టీ ఏమి తీసిపోయేలా లేవు !!! అని పలువురు విపక్ష నేత లు, పలువురు జర్నలిస్టులు అనుకున్నప్పటికీ

ఏది ఏమైనప్పటికి జగిత్యాల ప్రాంత రాజకీయ నాయకులే జర్నలిస్టులకు అండదండ కానీ

*జమీన్ కొరకు జిద్ద్ చేస్తేనే జీతెంగా క్యా ???* అన్నట్లుగా మాత్రం ఉండరాదు వారి దోస్తీ... సానుకూల స్పందనతో లక్ష్యం నెరవేరుతుందని ఆశ జర్నలిస్టులలో గుడిసెలో గుడ్డిదీపంలా మిణుకు మిణుకు మంటుంది .

 

*4th ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులకు కావాల్సింది ఎస్టేట్ లు కాదు. వాళ్ళ ఊరిలో అనుకూలమైన కొన్ని సెంట్ల స్థలం.*

 

కైండ్‌ హార్టెడ్‌ కమిటెడ్‌ రెస్పాన్స్‌బుల్‌ లీడర్‌ ఎవరైనా ఉన్నారా ??? అని జర్నలిస్టు సమాజం మూగ మనసుతో ప్రశ్నిస్తుంది!!! అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.

దయచేసి శ్రమ యొక్క విలువను రోడ్డున నిలబెట్టకండి అని వేడుకున్న జర్నలిస్టుల మాటలు ఈసారి వృధా కాలేదు.

హితుడా, జర్నలిస్టు మిత్రుడా నేటి పరిస్థితులకు మన అలిశెట్టి ప్రభాకరన్న మాటలు :  

శిల్పం చెక్కకముందు బండ

శిక్షణ పొందకముందు మొండి

ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస

సో.......

కాలానికి వదలకు భరోసా !!!! మాటలను

స్ఫూర్తిగా నింపుకుని మనము మన డిమాండ్లు నెరవేరే వరకు పోరాడుదాం.అనుకొని మొత్తం మీద 15 రోజులపాటు వివిధ రూపాల్లో తమ ఉద్యమాన్ని కొనసాగించారు.

ఈసారి మాత్రం ఉవ్వెత్తున లేచి పడిన ఉద్యమ కెరటానికి ప్రజా సంఘాలు ,వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యాపార, వాణిజ్య వేత్తలు, విద్యాలయాల యాజమాన్యాలు, వ్యక్తులు ఒక్కరేమిటి ప్రతి ఒక్కరు జర్నలిస్టుల న్యాయబద్ధ మైన ఇండ్ల స్థలాల దీక్షలకు మద్దతు తెలపడం కొసమెరుపే కాదు.

కొంతవరకు జర్నలిస్టులలో నైతిక ధైర్యం పెంచడానికి, ఉద్యమస్ఫూర్తిని కొనసాగించడానికి దోహదపడిందని చెప్పక తప్పదు.

ఇది కేవలం స్థానిక ప్రజాప్రతినిధులకే పరిమితం కాక రాష్ట్రస్థాయిలో క్యాబినెట్ స్థాయి సంబంధిత మంత్రితో పాటు అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతు రావడం పట్ల జర్నలిస్టులు తమకల నెరవేరుతుందని గట్టి నమ్మకంతో పాటు స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ అడ్లూరి, శాసనమండలి సభ్యులు ,ఐజేయు జర్నలిస్టుల నాయకుల తదితరుల సమక్షంలో నిమ్మరసం స్వీకరించడం ఒక గొప్ప ప్రయత్నానికి నాంది అని చెప్పక తప్పదు. 

అంతేకాకుండా దశాబ్దాల కాలంగా ఉన్న జర్నలిస్టుల కల నెరవేరుతుందని నమ్మకం సైతం కల్పించగలిగింది.

ఈ మైత్రి పర్వం లో

ప్రస్తుత అధికార హస్తం పార్టీ జగిత్యాల జర్నలిస్టులపై చేయూత హస్తం గా ఉంటుందని ఆశిద్దాం మూడు దశాబ్దాల చిరకాల వాంఛ నెరవేరుతుందని ఎదురుచూపులు నిజం కానున్నాయని ఆశావహ దృక్పథంతో జర్నలిస్టులు చూడాల్సిందే... 

జో వాదా కియా వో నిభానా పడేగా !!!

Tags
Join WhatsApp

More News...

Local News 

ఎబిజెఎఫ్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాదస్తు రాజేష్

ఎబిజెఎఫ్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాదస్తు రాజేష్ మెట్టుపల్లి నవంబర్ 07 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ కార్యాలయంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ (ఎబిజెఎఫ్) రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మహ్మద్ అబ్దుల్ ముస్సావీర్ ఆదేశాల మేరకు (ఎబిజెఎఫ్) జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా విజన్ ఆంధ్ర పేపర్ కోరుట్ల ఈ...
Read More...
National  International   State News 

ఢిల్లీ విమానాశ్రయంలో  ATC సిస్టమ్ (Air Traffic Control System) ఫెయిల్యూర్ – సైబర్ దాడి అనుమానాలు

ఢిల్లీ విమానాశ్రయంలో  ATC సిస్టమ్ (Air Traffic Control System) ఫెయిల్యూర్ – సైబర్ దాడి అనుమానాలు 400 లకు వందలకు పైగా విమాన రాకపోకలు ఆలస్యం, కొన్ని రద్దు. ఇప్పటికీ ఇంకా సాధారణ స్థితికి రాని డిల్లీ విమానరాకపోకలు హైదరాబాద్, నవంబర్ 07, ప్రజా మంటలు: దేశ రాజధాని ఢిల్లీలోని ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International Airport) ఈ రోజు మధ్యాహ్నం భారీ సాంకేతిక లోపం (Technical Glitch) సంభవించింది....
Read More...
Crime  State News 

చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత

చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత – బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, నవంబర్ 07  (ప్రజా మంటలు): చేవెళ్ల వద్ద ఇటీవల జరిగిన భయంకర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయి ప్రియ, నందిని, తనూష కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత...
Read More...
Local News  State News 

హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం  ఆది బజార్–2025’

హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం  ఆది బజార్–2025’ గిరిజన కళాకారులకు మార్కెట్ వేదికను అందిస్తోంది ఆది బజార్‌: దివ్య దేవరాజన్ హైదరాబాద్‌, నవంబర్‌ 7 ( ప్రజా మంటలు): హైటెక్‌ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో జాతీయ గిరిజన ఉత్సవం ‘ఆది బజార్–2025’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈవో దివ్య దేవరాజన్,...
Read More...
Local News  State News 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం హైదరాబాద్, నవంబర్ 07 – (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవ్ఉఎండ్మ్మఆర్డి రెడ్డితో కలిసి, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లాపరిషద్ చైర్‌పర్సన్ తుల ఉమ ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు....
Read More...
Local News 

ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు

ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవితనస్రీన్ బేగంతో కలసి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం సికింద్రాబాద్, నవంబర్ 07 ( ప్రజామంటలు): రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి.కవిత అన్నారు. మహిళా కాంగ్రెస్ ఏ–...
Read More...
Local News 

అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..

అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ.. బీజేపీ  రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి... సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):    భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ రాజ్యాంగాన్ని...
Read More...

మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ

మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారి ఆధ్వర్యంలో మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం డిసెంబర్ 6_ 2025 శనివారం నుండి డిసెంబర్ 14 _2025 ఆదివారం మార్గశీర్ష మాసంలో శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్...
Read More...

ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ

ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ హైదరాబాద్, నవంబర్ 07 – ప్రజా మంటలు: ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల ఫలితంగా కళాశాల యాజమాన్యాలు తమ బంద్ మరియు నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం...
Read More...
Local News 

వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ 

వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ  సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):  దేశభక్తి, ఐక్యత ప్రతీకగా నిలిచిన జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పీఐబీ హైదరాబాద్‌ ఘనంగా నిర్వహించింది. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ), డీపీడీ యూనిట్లతో కలిసి పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది...
Read More...
Local News 

ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్‌మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్ 

ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్‌మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్  సికింద్రాబాద్, నవంబర్07 (ప్రజామంటలు)::రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణలు తక్షణం అమలు చేయాలని ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.మూర్తి డిమాండ్‌ చేశారు.శుక్రవారం ముషీరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలలో హేమలత అధ్యక్షతన జరిగిన యూనియన్‌ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ— ప్రభుత్వ...
Read More...
Local News 

సెయింట్ ప్రాన్సిస్  గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు

సెయింట్ ప్రాన్సిస్  గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజామంటలు): సికింద్రాబాద్ సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో శుక్రవారం 150 వసంతాల వందేమాతరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బాన్ని పురస్కరించుకొని స్కూల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్సీసీ కమాండ్ ఆఫీసర్ కల్నల్ ఎంఎస్.కుమార్ ను స్కూల్ హెడ్మాస్టర్ సిస్టర్ గ్రేసీ, ఎన్సీసీ కోఆర్డినేటర్ ఏ.క్రిస్టినా నిర్మల, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు...
Read More...