స్వాతంత్ర్య ఫలితాలు అందరికీ అందాలి -ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
స్వాతంత్ర్య ఫలితాలు అందరికీ అందాలి
-ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఆగస్టు 15 (ప్రజా మంటలు) :
ఎందరో భారతీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వాతంత్ర్య ఫలాలు దేశవాసులందరికీ చెందాల్సిన అవసరం అనివార్యంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.గురువారం 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హోదాలో ప్రప్రథమంగా జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...స్వాతంత్ర్యం సాధించిన అమరులను, వాటి అమూల్య త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నియోజక వర్గ సమస్యలన్నీ తనకు కరతలామలకం మాత్రమే అని, సమయానుకూలంగా వాటి పరిష్కారం కోసం అహరహం శ్రమించి, ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే సతీమణి కాంత కుమారి, పిసిసి సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్, మున్సిపల్ కౌన్సిలర్ లు సంతోషి, నాగలక్ష్మి,
పద్మ, అరునాయకులు వేముల రాజేశ్, ప్రసాద్ సింహరాజు, సముక్, సత్యనారాయణ, శ్రీనివాస్, మొగిలి, రాజేశ్, తిరుపతి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
