జర్నలిస్ట్ ల దీక్షకు సంఘీభావం తెలిపిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.
జగిత్యాల ఆగస్ట్ 5 (ప్రజా మంటలు) ;
సమాజంలో జర్నలిస్ట్ ల పాత్ర కీలకం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వం పారదర్శకత విధానంతో ముందుకు సాగేందుకు తోడ్పాటును అందించేది జర్నలిజం వ్యవస్థ.
గతంలో ప్రింట్ మీడియకే పరిమితం అయిన సమాచార వ్యవస్థ ఎలక్ట్రానిక్ మీడియా రాకతో క్షణంలో వార్తలు ప్రజల ముంగిట ఉండే పరిస్థితి వచ్చిందని జగిత్యాల పాత్రికేయ సోదరుల ఇండ్ల స్థలాల కల్పన ప్రక్రియ నాన్చడం జరుగుతుందని అన్నారు
ఇందులో నా బాధ్యత ఎంత ఉందొ, మీ బాధ్యత అంతే ఉందన్నారు.
నలభై ఏళ్లలో నాలుగు పార్టీలకు చెందిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి.
అప్పటి నుండి ఇప్పటివరకు ఉన్న నాయకత్వం మన ముందరే ఉన్నారు.
నాకు ఇళ్ల స్థలాల కల్పన పై ఒక అభిప్రాయం ఉందని పేర్కొన్నారు.
ధరూర్ క్యాంప్ లో స్థలాల కేటాయింపునకు కొంత వెనక్కి వచ్చిన మాట వాస్తవమే అన్నారు.
భవిష్యత్ కు ఏకైక ఆధారం ధరూర్ క్యాంప్. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు.
కొన్ని సమయాల్లో ప్రత్యామ్నాయం గా స్థలాలు సూచించిన. కొంత భేదభిప్రాయం ఉండడం వల్ల సమస్య మొదలైందన్నారు.
జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కల్పించడం ప్రభుత్వం భాద్యత అన్నారు.
ఈ విషయాన్నీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నివేదిస్తానని తెలిపారు.
నన్ను మీరు అన్యధా భావించవద్దు. నా అభిప్రాయం నేను కలిగి ఉన్న అన్నారు.
గత పదేళ్లలో బీఆరెస్ ప్రభుత్వం పాలన చేసింది. అప్పుడే స్థలాలు కేటాయిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
తెలంగాణ ఉద్యమ సాధనలో జర్నలిస్ట్ ల పాత్ర కీలకమన్నారు.
ఇండ్ల స్థలాల ఆశలు ఫలప్రదం అయ్యే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని భావిస్తున్నాను అన్నారు.
అందరి పరిస్థితి భిన్నం - నా పరిస్థితి విభిన్నం. నేను కొంత ఆశించిన మేరకు స్పందించకున్న ఏనాడూ విభేదించలేదన్నారు.
ఏది ఏమైనా సాధ్యం అయినంత మేరకు ఇళ్ల స్థలాల కల్పనాకు నా వంతు తోడ్పాటు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి బండ శంకర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య కాంగ్రెస్ నాయకులు గాజుల రాజేందర్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన
