జగిత్యాల నియోజకవర్గ ఆలయాలకు టీటీడీ అభివృద్ధి నిధులు మంజూరు
మన దేశానికి రైతే వెన్నెముక ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల నియోజకవర్గ ఆలయాలకు టీటీడీ అభివృద్ధి నిధులు మంజూరు
ఒక్కో ఆలయ ధ్యాన మందిరం కోసం10 లక్షల చొప్పున 90 లక్షలు మంజూరు -ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల జులై 17( ప్రజా మంటలు)
*అన్నదాతకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చరిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు
బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ,తొలి ఏకాదశి సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ హిందూ బందువులకు మంచి శుభవార్త - జగిత్యాల ప్రాంతములోని 9 ఆలయాలకు ఒక్కో ఆలయానికి 10 లక్షల చొప్పున 90 లక్షలు నిదులు టి టీ డీ మంజూరు చేసిందని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.
టి టి డి ఛైర్మెన్, ధర్మకర్తలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జగిత్యాల పట్టణం లో శ్రీరామ మందిరం,బ్రాహ్మణ వాడ.శ్రీ గుట్ట రాజేశ్వర దేవస్థానం జగిత్యాల,శ్రీ వేంకటేశ్వర దేవస్థానం అంబారిపేట్,శ్రీ కోదండ రామాలయం ధరూర్ క్యాంప్,బీరప్ప దేవాలయం జగిత్యాల,శ్రీ హనుమాన్ దేవాలయం తిప్పన్న పెట్,శ్రీ హనుమాన్ దేవాలయం, సింగరావు పెట్,శ్రీ హనుమాన్ దేవాలయం రాయికల్,శ్రీ రాజ రాజేశ్వర నాగాలయం కొత్త పెట్ లకు ధ్యాన మందిరం,ప్రహారి గోడ,ప్రధాన ద్వారం గేట్ నిమిత్తం నిదులు మంజూరు అయ్యాయని తెలిపారు.
బీర్ పూర్ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయ అభివృద్ధికి గతం లో 30 లక్షల నిధులు మంజూరు చేయగా పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు.
శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామీ ఆలయం అభివృద్ది కి సైతం 80 లక్షలు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు.
అంతర్గం గ్రామంలో హనుమాన్ ఆలయ అభివృద్ధికి,నియోజకవర్గం లో ఇతర ఆలయాల అభివృద్ధికి నిధులు కోసం దేవాదాయ శాఖ మంత్రి ని కలిసి విన్నవించడం జరిగింది అని అన్నారు.
మన దేశానికి రైతే వెన్నెముక
రైతు పక్షపాతి,రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్న అప్పుల పాలు కాకూడదు అని రుణ మాఫీ అమలు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణ మాఫీ అనేది హర్షణీయం...
ఏకకాలం లో అమలు చేయటం అనేది చరిత్రాత్మకం అన్నారు.
రైతుల పక్షాన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,కౌన్సిలర్ లు కోరే గంగ మల్లు, కుసరి అనిల్,కూతురు రాజేష్,వొద్ది శ్రీలత రామ్మోహన్ రావు,నాయకులు తక్కురి మల్లేశం,రఘు పతి,రాజన్న,సురేష్ రెడ్డి,రాజు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి
