ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..? -జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..?
-జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల, జులై 11( ప్రజా మంటలు ) ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాస్వామ్యం కు నాలుగో స్థంభం అయిన జర్నలిజం పై ఉక్కు పాదం మోపుతూ, జర్నలిస్ట్ లపై దాడులు చెయ్యడమా అని జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ప్రశ్నించారు. ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ కరువైందన్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్ట్ లు కవరేజికి వెళ్తే, కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్ట్ పై దాడులు చేయడం పై దురదృష్టకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీడియా పై దాడులు మొదలవడం ప్రజాస్వామ్యం కే మాయని మచ్చ అని అన్నారు. గతంలో న్యూస్ లైన్ రిపోర్టార్ జర్నలిస్ట్ శంకర్ పై దాడులు చేశారని, ఇటీవల బాల్కంపేట ఎల్లమ్మ తల్లీ బోనాల కవరేజి కి వెళ్లిన 10 టివి ఛానల్ మహిళా జర్నలిస్ట్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించరాని గుర్తు చేశారు. ప్రజా పాలన అంటూనే ప్రజల పక్షంగా, ప్రజలు ప్రభుత్వం కు మధ్య వారిదిగా ఉండే మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం ఏంటని వసంత ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమ కాలం నాటి పరిస్థితి కనిపిస్తుందని గుర్తు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమ ఇబ్బందులు ప్రభుత్వం కు విన్నవించే ప్రయత్నం చేస్తే పట్టించుకోని ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పరీక్షల నిర్వహణ చేస్తుందని, దీంతో అగ్రహించిన విద్యార్థులు, అభ్యర్థులు నిరసనలు దిగితే వారి వెనక రాజకీయశక్తులు ఉన్నాయని, కోచింగ్ సెంటర్ ల మాఫియా ఉందని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడ్డం విచారకరం అన్నారు. సీఎం ప్రకటనపై నిరుద్యోగులు ఆందోళన చేస్తే వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏకపక్షంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా చర్యలు చేపట్టడం దురదృష్టకరం అన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను తొక్కివేసిన ప్రభుత్వం, వారి ఆకాంక్షలను ప్రపంచానికి చూపించేందుకు వెళ్లిన జర్నలిస్ట్ లపై దాడులు జరపడం, వారిపై దురుసుగా ప్రవర్తించడం నియంత పాలనకు నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల విషయంలో పునరాలోచన చెయ్యాలని, జర్నలిస్ట్ లపై దాడులు నిలువరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మీడియపై జర్నలిస్ట్ పై దాడులకు దిగితే బీఆరెస్ పార్టీ ఊరుకోబోధని, జర్నలిస్ట్ లకు అండగా నిలిచి, ప్రభుత్వ విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్

ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
