సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

On
సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల జులై 3 (ప్రజా మంటలు) :


సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్   బల్దియా కార్యాలయం ఒక వేదిక కాబట్టి  జగిత్యాల పట్టణం లోని 48 వార్డుల్లో నెలకొన్న ఏవైనా సమస్యలుంటే ప్రజాదర్బార్‌లో పట్టణ ప్రజలు  ఫిర్యాదులు చేసి పరిష్కరించుకోవాలని సమస్య ను పరిష్కరించడానికి దోహపడుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.

మంగళ వారం బల్దియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వివిధ వార్డుల్లో  నుంచి వచ్చిన ఫిర్యాదులను బుధవారం 7, 8 వార్డుల్లో  బల్దియా చైర్ పర్సన్ పర్యటించి ప్రజల సమస్యను పరిష్కరించారు. 

ఈసందర్భంగా వార్డుల్లో ఖాళీ స్థలంలో నిలువ ఉన్న డ్రైనేజీ , వర్షం నీరు ఎక్కడికి అక్కడ నిలువ ఉండటంతో వార్డులో పర్యటించి ఆయిల్ బాల్స్ వేశారు. నిలువ ఉన్న ఖాళీ స్థలంలో చెత్త చెదారం, నీటి నిలువ  స్థల యజమానులే చూసుకోవాలనీ సూచించారు. 

ప్రజలు ప్రతి మంగళ వారం నేరుగా బల్దియా కార్యాలయం కు వచ్చి ఫిర్యాదులు చేయవచ్చన్నారు.

ఈకార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వారణాసి మల్లవ్వ తిరుమలయ్య , బల్దియా అధికారులు ఉన్నారు.

Tags