సీనియర్ నేత జీవనన్న సేవలు పార్టీ ఉపయోగించుకుంటుంది ఉపముఖ్యమంత్రి భట్టి 

On
సీనియర్ నేత జీవనన్న సేవలు పార్టీ ఉపయోగించుకుంటుంది ఉపముఖ్యమంత్రి భట్టి 

సీనియర్ నేత జీవనన్న సేవలు పార్టీ ఉపయోగించుకుంటుంది ఉపముఖ్యమంత్రి భట్టి 

హైదారాబాద్ జూన్ 25:

హైదారాబాద్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో ముగిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు.

జీవన్ రెడ్డి నివాసం వద్ద మీడియాతో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు, మా అందరికీ మార్గదర్శకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వ నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటాం అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అని,ఈ ప్రభుత్వం నడవడం కోసం వారి ఆలోచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాం అని అన్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియార్టీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సమచిత ప్రాధాన్యమిస్తూ గౌరవిస్తుందని,సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదని,పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మనస్తాపం చెందితే  మేమందరం బాధపడతాం అని భట్టివిక్రమార్క అన్నారు.

Tags