పరిశుభ్రత తోనే వ్యాధుల నివారణ జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్
పరిశుభ్రత తోనే వ్యాధుల నివారణ
జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జూన్ 20:
పరిశుభ్రత తోనే అధిక వ్యాధుల నివారణ సాధ్యమని జగిత్యాల జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. గురువారం జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా ధర్మపురి క్షేత్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ పక్షాన నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి డిప్యూటీ డీ ఎం హెచ్ ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ... పరిసరాల పరిశుభ్రత తోనే చాలా వరకు వ్యాధులు సోకకుండా అరికట్టడం సాధ్యమన్నారు. బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయరాదన్నారు. భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, పండ్లను, కూరగాయలను శుభ్రమైన నీటితో కడిగి వాడలని, శుభ్రమైన నీటిని త్రాగాలి అని, గోర్లను, చిన్నవిగా శుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు. 1నుండి 19 ఏళ్ల మధ్య వయసున్న వారికి 17,842 మందికి నేరేళ్ళ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఆల్బెండ జోల్ మాత్రలు వేయడం లక్ష్యంగా చేసుకొని, కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. పిల్లలకు మాత్రలను వేశారు.
ధర్మపురి ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ అరుణ, మున్సిపల్ కౌన్సిలర్లు వేముల నాగరాణి, గరిగె అరుణ, మున్సిపల్ కమిషనర్ బాలె గంగాధర్, నాయకులు అనంతుల లక్ష్మణ్, నేరెళ్ళ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ అవంతి, జిల్లా కార్యక్రమ పర్యవేక్షకులు శ్రీధర్, సి హెచ్ ఓ శ్రీనివాస్, హెచ్ ఈ ఓ సతీష్, ఎం ఎల్ హెచ్ పి మామిడి వినయ్, ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, ఏ ఎన్ ఎంలు, ఆశా, ఆరోగ్య సిబ్బంది, ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
