అంగన్వాడి కేంద్రంలో బడిబాటలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం.

On
అంగన్వాడి కేంద్రంలో బడిబాటలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 996334943/9348422113).

 

జగిత్యాల - సారంగాపూర్ జూన్ 12 ( ప్రజా మంటలు ) : 

సారంగాపూర్ మండలంలోని రేచపెల్లి సెక్టర్ పరిధిలోని అంగన్వాడి కేంద్ర లలో ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ శైలజ ఆధ్వర్యంలో బుధవారం అంగన్వాడి టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా లచక్కపేట అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం సూపర్వైజర్ శైలజ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే ప్రీస్కూల్ కార్యక్రమాల పట్ల తల్లులకు పూర్తి అవగాహన కల్పించడం జరిగింది.

అంగన్వాడీ కేంద్రాలలో పోషక విలువల తో కూడిన పౌష్టికాహారం అందించడం జరుగుతుంది అని తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాలలో ఆహ్లాదకరంగా ఆటపాటలతో చక్కని విద్యను అందించే అంగన్వాడీ కేంద్రాలలో 2.5 నుండి 5 సం " లోపు పిల్లలకు చేర్పించాలని కోరారు. చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వెంకటరమణ, నరసమ్మ, ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు వంశి , పాఠశాల టీచర్స్ డి. లత, అంగన్వాడీ ఆయాలు ,తల్లులు, కిషోర బాలికలు,గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags