జాతీయ మెగా లోక్ అదాలత్ లో 3112 కేసుల పరిష్కారం.
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంలో కృషి చేసిన పోలీస్ అధికారులని, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్
**
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 9( ప్రజా మంటలు )
రాజీ పడదగిన కేసుల్లో ఉన్నవారు రాజీమార్గం ద్వారానే పరిష్కరించుకోవడమే మంచిదని దీని ద్వారా సమయం వృధా కాదని కక్షలు, కారుణ్యాలు తగ్గుతాయని తద్వారా స్నేహభావం పెంపొందుతుందని జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అన్నారు. కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురయ్యే వారికి సత్వర న్యాయం అందించేందుకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి శనివారం రోజున కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో జిల్లా పరిధిలో ఉన్న రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి డీఎస్పీలు, సి.ఐలు ఎస్.ఐలు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి వారికి అవగాహనా కల్పించి లోక్ అదాలత్ లో జిల్లా పరిధిలో 3112 కేసులు పరిష్కరించడం జరిగిందని అన్నారు.
ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి 1894 కేసులో ఉన్నవారికి కోర్టు వారు మొదటి తప్పుగా బావించి జరిమానాలు విదించడం జరిగిందని మద్యం సేవించి వాహనం నడిపి మరోసారి పట్టుబడినట్లైతే వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుంది, 538 ఈ- పెట్టి కేసులు,680 ఐపిసి కేసులు జిల్లావ్యాప్తంగా వివిధ సెక్షన్ల కింద నమోదు అయిన మొత్తం కేసులు 3112 కేసులు పరిష్కరించడం జరిగిందని అన్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా కేసులను పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
