ఎన్ డి ఏ – ఇండియా కూటమి లలో గెలుపు ఎవరిదో ఈనాడే తెలిపోతుంది

పోటీ చేయకున్న విజయం తథ్యమా?

On
ఎన్ డి ఏ – ఇండియా కూటమి లలో గెలుపు ఎవరిదో ఈనాడే తెలిపోతుంది

ఎన్నికల ముందస్తు ఫలితలన్నీ నిజమేనా ?

మీడియా కథనాలన్నీ ముందస్తు ప్రణాళికలో భాగమేనా?

ఎన్ డి ఏ – ఇండియా కూటమి లలో గెలుపు ఎవరిదో ఈనాడే తెలిపోతుంది

 

హైదరాబాద్ జూన్ 03  :

దాదాపు పది వారాల పాటు దేశంలో, రాజకీయ పార్టీలలో నెలకొన్న ఉత్సుకతకు మంగళవారం తెరపడనుంది. దేశ భవిష్యత్ ను తేల్చే సాదారణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కానీ ఈ ఎన్నికల ఫలితాలను ముందస్తుగా సర్వేల ద్వారా అంచనా వేసిన అన్నీ మీడియా, సర్వే సంస్థలు ప్రధాని మోడి మళ్ళీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రానున్నారని తేల్చి చెప్పాయి. మొదటి నుండి జాతీయ మీడియా సస్థలు, సర్వేలు ఎన్ డి ఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాదిస్తుందని చెపుతున్నాయి. చివరికి పోటీ చేయక పోయిన, సీట్లు గెలుస్తుందని చెప్పే దశకు ఈ సర్వేలు వెళ్ళాయి.  

 

దేశ ప్రధాని నరేంద్ర మోడి మూడవ సారి ప్రధాని కావడం ఖాయమని, బిజేపి పార్టీ పూర్తిగా నమ్ముతుంది. అలాగే ప్రధాని మోడి స్వయంగా 400 లకు పైగా సీట్లు గెలుస్తామని, అందులో బిజేపి స్వయంగా 370 సీట్లు గెలుస్తామని ప్రకటించారు. అదే అంశాన్ని ఎన్నికలకు ముందునుండి బిజేపి అధినాయకులు అమిత షా, జే పి నడ్డా లాంటి వారు కూడా తమ ప్రచారంలో వాడుకోవన్నారు.

 

ఏడు దశలలో జరిగిన ఎన్నికల్లో ప్రతి దశలో బిజేపి పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని, అనుకొన్నాన్ని సీట్లు రావడం కష్టమనే అన్నీ వార్తా సంస్థలు, సామాజిక మాధ్యమాలు  అంచనా వేశాయి. కానీ ప్రతి దశలోనూ ప్రధాని ఎన్నికలను హిందుత్వ ఏజండా తో ముందుకు తీసుక వెళ్లి,  ముస్లింలకె ఇండియా కూటమి మద్దతు ఇస్తూ, హిందువులకు అన్యాయం చేస్తుందని ప్రచారరం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకుల భాష పూర్తిగా దిగజారిపోయిందని, గతంలో ఎన్నడూ లేనంత దూషణాలతో ఎన్నికలు ముగిశాయి.      

 తమిళనాడులో కాంగ్రెస్ కు 13-15 సీట్లు

తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 39 సీట్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకు పోటీ చెటున్ది. కానీ ఇండియా ఆక్సిస్ సర్వేలో 13-15 సీట్లు గెలుస్తుందని చెప్పింది. తమిళనాడులో బిజేపి ఈసారి తప్పకుండా 2-5 సీట్లు గెలుస్తుందని కూడా చెపుతున్నాయి. తమిళనాడు, కేరళలో బిజేపి తన వోట్ల శాతం పెరుగుతుందని ముందునుండి అందరూ అనుకొంటున్నారు. కానీ సీట్లు మాత్రం ఈ రెండు రాష్ట్రాలలో రావని అనుకొనుతున్నారు. కానీ సర్వే సంస్థలు మాత్రం బిజేపికి 5 నుండి 7 సీట్లు రావచ్చని చెప్పడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు.

 

బీహార్ లో 5 పోటీ చేస్తే 6 సీట్లు గెలుస్తారా?

బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి లోని భాగస్వామి అయిన చిరాగ్ పాశ్వాన్ పార్టీ లోక్ జనశక్తి(ఎల్ జే పి) పార్టీ  2019 లో 6 సీట్లకు పోటీ చేసింది. కానీ ఈసారి మారిన రాజకీయ సమీకరణాలలో భాగంగా, 5 సీట్లకు మాత్రమే పోటీ చేస్తుంది. కానీ సర్వేలో ఎల్ జే పి 6 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని ప్రకటించడం సర్వేలలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది.    

 

ఇలా పోటీ చేయకున్నా సీట్లు గెలుస్తుందని చెప్పడం వల్ల సర్వే సంస్థల అంచనాల విషయంలో సందేహాలు నెలకొంటున్నాయి. అలాగే దాదాపు అన్నీ సర్వే సంస్థలు 350 నుండి 416 సీట్ల వరకు ఎన్డీఏ గెలుస్తుందని ప్రకటించడం  అనుమానాలకు తావిస్తుంది. బిజేపి కి వచ్చే వోట్ల శాతానికి, సీట్ల శాతానికి పొంతన లేని విధమైన అంచనాలు ఇవ్వడం అనేది ముందస్తుగా బిజేపిటో కుమ్ముకకై, ఈ అంచనాలను విడుదల చేయడం, ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడానికే ననే ప్రచారం ఉండి. ఏమైనా ఈ ప్రజాస్వామ్య పండగ కూడా వంచన  క్రీడా గా మారిపోతుందా అనే సందేహం కలుగుతుంది. దేశ భవిష్యత్ ను తీర్చిదిద్ది, ప్రజాస్వామ్య  పరిరక్షణకు అనుకూలమైన ఫలితాలు రావాలని అందరూ ఆశిస్తున్నారు.

Tags