సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు

On
సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు

సంప్రదాయ రీతిలో ధర్మపురిలో హనుమజ్జయంతి వేడుకలు


ధర్మపురి జూన్ 01 (ప్రజా మంటలు -
రామ కిష్టయ్య సంగన భట్ల) :                  
తెలంగాణ లోని ప్రాచీన పుణ్య క్షేత్రాలలో నొకటియై, పవిత్ర గోదావరీ నదీ తీరాన వెలసి, పలు దేవాలయాల సముదాయంతో అలరారుతున్న పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో శని వారం పెద్ద హనుమజ్జయంతి వేడుకలు సంప్రదాయ రీతిలో జరిగాయి. అంజనీ పుత్రుడైన మారుతి శరణు ఘోషలు, జయజయ ధ్వనాలు, భగవ న్నామ స్మరణలు, భక్తి సంగీతాలు, వేద మంత్రాలతో సనాతన క్షేత్రంలో భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. ఉదయాత్పూర్వం ప్రత్యే కించి హన్మాన్ దీక్షాపరులు పవిత్ర గోదావరిలో మంగళ స్నానా లను ఆచరించి, దైవ దర్శనాలు చేసుకున్నారు.


శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాంతర్గత ఆంజనేయస్వామి ఆలయంలో దేవస్థాన అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి, కళ్యాణ్, వామాన్, కార్తీక్, వేద పండితులు బొజ్జ సంపత్ కుమార్ 
 శర్మ, ముత్యాల శర్మ ఆధ్వర్యంలో, ఈఓ శ్రీనివాస్, ఐ. రామయ్య నేతృత్వంలో, పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని  ఆంజనేయస్వామి వారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం , సుందరాకాండ పారాయణం లతో ప్రత్యేక పూజలు, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. 
 దేవస్థానం కార్యనిర్వహణా ధికారి సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ, ప్రవీణ్ కుమార్, ఉపప్రదాన అర్చకులు నేరెళ్ళ శ్రీనివాసాచార్య, స్థానిక వేదపండితులు, అర్చకులు వొద్దిపర్తి నరసింహ మూర్తి , కళ్యాణ్ కుమార్ , నంబి అరుణ్ కుమార్, బొజ్జ రమేశ్ శర్మ, రాజగోపాల్ , అర్చకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. 


ఉపవాస దీక్షాదక్షులైన హన్మాన్ భక్తులు దేవస్థానంలో దర్శనాలు చేసుకుని, ప్రసాదాలనుకొని, పరమాన్నాలుగా గ్రహించారు. 

నదీతీరాన గోదా వరీ భద్రానదీ సంగమ స్థానాన వెలసిన దక్షిణాభిముఖుడైన భక్తాంజనేయ స్వామిని దర్శించు కున్నారు.
 చారిత్రిక, పౌరా ణిక నేపథ్యాన్ని కలిగిన ఈ ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా ఉదయం ఆరు గంటలనుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మన్యుసూక్త సంపుటి, సుందరాకాండ పారాయణాది ప్రత్యేక పూజలను అనువంశిక అర్చకులు మధ్వాచారి రాంకిషన్ శర్మ, పవన్ కుమార్ ఆద్వర్యంలో సాంప్రదాయ వేదోక్త రీతిలో నిర్వహించారు. 
 రామమందిరంలో తాడూరి రఘునాథ్ శర్మ  సాంప్రదాయ పూజనొనరించారు.

Tags