తెలంగాణ స్థానిక సంస్థలలో 42% బిసి రిజర్వేషన్ పరిరక్షణ సామాజిక - సాధికారికత సాధించాలి  -రాపోలు ఆనంద భాస్కర్

On
తెలంగాణ స్థానిక సంస్థలలో 42% బిసి రిజర్వేషన్ పరిరక్షణ సామాజిక -  సాధికారికత సాధించాలి  -రాపోలు ఆనంద భాస్కర్

తెలంగాణ స్థానిక సంస్థలలో
42% బిసి రిజర్వేషన్ పరిరక్షణ: సామాజిక సాధికారికత సాధించాలి 
-రాపోలు ఆనంద భాస్కర్

హైదరాబాదు జూన్ 01:

రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఆశావహులలో 
బిసి అభ్యర్థులను, 
బిసి సంఘాల్లో భాగస్వాములను,
వివిధ కులాలలో ప్రోఫెషనల్ అసోసియేషన్ల ప్రతినిధులను
సమాయత్త పరిచి, 
స్థానిక సంస్థలలో 
42% బిసి రిజర్వేషన్ 
లక్ష్య సాధన కోసం హైదరాబాద్ లో మాజీ ఎం. పి. రాపోలు ఆధ్వర్యంలో జరిపిన
సుదీర్ఘ సమాలోచనలో 
జస్టిస్ చంద్ర కుమార్, మాజీ ఐఎఎస్ అధికారి చిరంజీవులు, 
వి.జి.ఆర్. నారగోని, ప్రొ. తాటికొండ వెంకట రాజయ్య, ప్రొ. ప్రభంజన్ యాదవ్, అభినవ సర్దార్ సర్వాయి పాపన్న జైహింద్ గౌడ్, తెలంగాణ విఠల్, పృథ్వీరాజ్ యాదవ్, దాసు సురేష్ నేత, నరేందర్ గౌడ్, భాగ్య లక్ష్మి, మారెపల్లి లక్ష్మణ్ నేత, హరిదృఢ, కోల జనార్ధన్, తీగల లక్ష్మణ్ గౌడ్, పోషం అశోక్, తదితరులు పాల్గొన్నారు. 
తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థలలో ఆశావహులు, బిసి సంఘాల్లోని క్షేత్ర స్థాయి కార్యకర్తలు, వివిధ కులాల ప్రొఫెషనల్ అసోసియేషన్ల ప్రతినిధులు ఏకమై, 
పునాదిని కాపాడుకోవడం వంటి రిజర్వేషన్ల పరిరక్షణ కు 
మండలాల స్థాయిలో సమావేశాలు, ప్రదర్శనలతో
ఎలుగెత్తి చాటాలని,
ఈ ప్రధానమైన రక్షణ కాపాడుకోవడం బిసి బిడ్డల భవిష్యత్తు తో ముడివడి ఉందని
ముక్తకంఠంతో నిర్ధారించారు.
Tags