విద్యుత్ షాక్ తో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు అందజేసిన అదనపు ఎస్పి వినోద్.

On
విద్యుత్ షాక్ తో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు అందజేసిన అదనపు ఎస్పి వినోద్.

(సిరిసిల్ల. విక్రాంత్ శర్మ - 9963349493/934842213).

 

జగిత్యాల మే 29 ( ప్రజా మంటలు ) : 

రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన మహిళ హోంగార్డ్ రాధా కుటుంబానికి అదనపు ఎస్పీ వినోద్ కుమార్ బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో యాక్సిడెంటల్ డెత్ కింద మంజూరు కాబడిన ఇన్సూరెన్స్ 30,00,000/-రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

రాధా కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున పూర్తి సహకారం అందిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ ఎం.డి అక్బర్, ఆపరేషన్ మేనేజర్ కె రామానుజo, సేల్స్ మేనేజర్ ఎం.డి సుఫియాన్,మరియు యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags