పోయిన డబ్బులను సీసీ కెమెరా ద్వారా గుర్తించి ఆ వ్యక్తి నుండి మహిళకు అందజేసిన ట్రాఫిక్ పోలీస్ ను అభినందించిన ఎస్సై.

On
పోయిన డబ్బులను సీసీ కెమెరా ద్వారా గుర్తించి ఆ వ్యక్తి నుండి మహిళకు అందజేసిన ట్రాఫిక్ పోలీస్ ను అభినందించిన ఎస్సై.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113) : 

జగిత్యాల మే 23 (ప్రజా మంటలు) : 

టవర్ సర్కిల్ వద్ద మ్యాంగోస్ అమ్ముతున్న మహిళ వద్ద రూ.4700  పోయినవని అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ లక్ష్మీనారాయణ ను సంప్రదించగా ట్రాఫిక్ పోలీస్ లక్ష్మీనారాయణ అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చూసి డబ్బులు దొరికిన వ్యక్తిని గుర్తించి ఆ డబ్బులను తిరిగి మహిళకు ఇవ్వటం జరిగింది.

ఈ సందర్భంగా టవర్ వద్ద విధులు నిర్వహిస్తున్న హెచ్ జి పి ఎల్ సి లక్ష్మీనారాయణ ను ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం,ఏ ఎస్సై సంధాని తదితరులు అభినందించారు.

Tags