శాంతి కళ్యాణం తో ముగిసిన మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు.

On
శాంతి కళ్యాణం తో ముగిసిన మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు.

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

జమ్మూ, కాట్రా మే 21 (ప్రజా మంటలు) : 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు జమ్ములోని (కాట్రా )ప్రాంతంలో ఈనెల 17 నుండి కొనసాగుతుండగా మంగళవారం శ్రీ గణపతి, మహాలక్ష్మి, సుదర్శన, రుద్ర సహిత శత చండీయాగము ,మహా పూర్ణాహుతి మరియు శాంతి కళ్యాణము, కుంకుమార్చనలతో ఘనంగా ముగిశాయి.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సేవ పరిషత్తు సభ్యులు, బాధ్యులు ,భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైదిక క్రతువులు మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి కార్యనిర్వక సభ్యులు తదితరులచే నిర్వహించబడినది. వార్షికోత్సవంలో భాగంగా సాంస్కృతిక ,సాహిత్య కార్యక్రమాలు, భజనలు, ప్రతినిత్యం స్థాపిత దేవత ఆరాధన, మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకం , నిత్య హోమాలు నిర్వహించారు.

చివరి రోజైన మంగళవారం వైదిక క్రతవుల్లో భాగంగా బలి ప్రధానము, కలుషోద్వాసనము, అవబృత స్నానము, కుంభ ప్రోక్షణ, మహదాశీర్వచనము, ఆచార్య, ఋత్విక్ సన్మానము ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు దోర్భల. కృష్ణమూర్తి శర్మ, ప్రధాన కార్యదర్శి ఘనపురం. రాంప్రసాద్ శర్మ, కోశాధికారి మహాదేవభట్ల. లక్ష్మణ ప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షులు వడిగచర్ల. విష్ణుమూర్తి శర్మ, జోషి. రమేష్, మహదేవ్ భట్ల. దిలీప్ కుమార్ శర్మ, చలివేంధ్రి. భవాని, సంయుక్త కార్యదర్శి జోషి. సత్యనారాయణరావు, రాజనాల. వెంకటేశ్వర శర్మ, యలమంచి. చంద్రశేఖర్ శర్మ, కశోజ్జుల. త్రివేణి, కార్యనిర్వాహక కార్యదర్శి సిరిసిల్ల. రాంప్రసాద్ శర్మ, వైదిక కార్యదర్శులు కొడకండ్ల. రాధాకృష్ణశర్మ, కూచి. వంశీకృష్ణ శర్మ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మదునూరి. మహాదేవ శర్మ, విఠల. మురళీధర శర్మ, శ్రవణ్ కుమారాచార్యులు, గోళ్ళ. గోవర్ధన్ శర్మ ,నిమ్మరాజు. చంద్రశేఖర్ శర్మ, దోమడాల. విశ్వనాథరావు, ముఖ్య సలహాదారులు నెమ్మాని. విష్ణుమూర్తి శర్మ, డా. తుమ్మూరి. లక్ష్మణరావు దామెర. సత్యనారాయణ శర్మ, యలమంచి విఠలేశ్వర శర్మ లు మరియు సమస్త సభ్యులు దాతల సహకారం చే వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు సేవా పరిషత్ అధ్యక్షులు తెలిపారు.

Tags